Rakul preeth singh: ఆయన్ని పెళ్లి చేసుకుంటే రకుల్ జైలు పాలవుతుంది...  వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

First Published | Oct 25, 2021, 12:25 PM IST


సమంత, నాగ చైతన్య విడిపోతారని ముందే చెప్పాను, వాళ్ళ జాతకరీత్యా జరిగేది ఇదే... అంటూ వార్తల్లోకి ఎక్కారు జ్యోతిష్యుడు వేణు స్వామి. తాజాగా ఆయన హీరోయిన్ రకుల్ ప్రీత్ పెళ్లిపై చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. 


ఆ వ్యక్తిని Rakul preeth singh పెళ్లాడితే జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని బల్ల గుద్ది చెప్పాడు. అక్టోబర్ 10వ తేదీన రకుల్ తన 31వ బర్త్ డే జరుపుకుంది. అదే రోజు రకుల్ తన ప్రియుడిని, కాబోయేవాడిని పరిచయం చేసింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జక్కి భగ్నానీని వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ప్రకటన అనంతరం వేణు స్వామి వీరిరువురి జాతకాలు పరిశీలించడం జరిగింది. 

రకుల్, Jackky bhagnani జాతకాల రీత్యా షష్టాష్టకాలు ఏర్పడుతున్నాయి అన్నారు. ఇలాంటి జాతకాలు కలిగిన అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకుంటే అనేక బాధలు తప్పవు అన్నారు. ఎంగేజ్మెంట్ తరువాత కూడా రకుల్ పెళ్లి ఆగిపోవచ్చు, ఒక వేళ వివాహం జరిగితే అనేక అరిష్టాలు ఆమెకు దాపురిస్తాయని వేణు స్వామి జోస్యం చెప్పారు. 
 


సంతానం కలగపోవడం, అశాంతి, న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు. ముఖ్యంగా రకుల్ జైలుపాలవుతుందని చెప్పి వేణు స్వామి సంచలనానికి తెరలేపారు. ఇప్పటికే డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రకుల్ భవిష్యత్ పై ఇలాంటి కామెంట్స్ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. 


కావున రకుల్ ఈ వివాహాన్ని రద్దు చేసుకోవడం మంచిది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. అందుకనే ముందుగానే హెచ్చరిస్తున్నాను. భయపెట్టడానికో, బెదిరించడానికో చేస్తున్న కామెంట్స్ కావు, సమస్యలు కొని తెచ్చుకోవద్దని, తెలియజేస్తున్నా, అని వేణు స్వామి తెలిపారు. 
 

ప్రస్తుతం వేణు స్వామి కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి అంత నమ్మకంగా వేణు స్వామి చెబుతుండగా, రకుల్ తన పెళ్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. Samantha విషయంలో వేణు స్వామి జాతకం కరెక్ట్ కాగా, రకుల్ స్పందన తెలియాల్సి ఉంది. 


మరోవైపు రకుల్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె హిందీలో వరుస చిత్రాలు చేస్తున్నారు.  మే డే, అటాక్, థాంక్ గాడ్, డాక్టర్ జి హిందీలో రకుల్ చేస్తున్న చిత్రాలు. 


అలాగే తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే చిత్రం చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు చిత్రంలో రకుల్ ఓ హీరోయిన్ గా చేశారు. ఈ మూవీ వివాదాల కారణంగా హోల్డ్ లో పడింది. 

Also read బుల్లితెర కామెడీ కింగ్స్.. సుధీర్,ఆది, శ్రీను, రామ్ ప్రసాద్... జబర్దస్త్ కమెడియన్స్ ఎంత వరకు చదువుకున్నారంటే!

Also read Rajababu: ప్రముఖ నటుడు రాజబాబు అకాల మరణం...!

Latest Videos

click me!