బుల్లితెర కామెడీ కింగ్స్.. సుధీర్,ఆది, శ్రీను, రామ్ ప్రసాద్... జబర్దస్త్ కమెడియన్స్ ఎంత వరకు చదువుకున్నారంటే!

Published : Oct 25, 2021, 11:28 AM ISTUpdated : Oct 25, 2021, 11:32 AM IST

జబర్దస్త్ కామెడీ షో నవ్వులకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ నచ్చేసిన ఈ షోలో కమెడియన్స్ కూడా పిచ్చ పాపులర్. స్టార్స్ కి ఏమాత్రం తగ్గని స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న Jabardasth కమెడియన్స్ సినిమాలలో కూడా రాణిస్తున్నారు.

PREV
112
బుల్లితెర కామెడీ కింగ్స్.. సుధీర్,ఆది, శ్రీను, రామ్ ప్రసాద్... జబర్దస్త్ కమెడియన్స్ ఎంత వరకు చదువుకున్నారంటే!

మరి ఇంతగా మనకు నవ్వులు పంచుతున్న జబర్దస్త్ కమెడియన్స్ ఏం చదువుకున్నారో తెలియాలంటే ఈ కథనం చదివేయడం.. నాన్ స్టాప్ పంచ్ లకు పెట్టింది పేరైన ఆది జబర్దస్త్ కమెడియన్స్ లో ఓ సంచలనం. తనదైన మార్క్ కామెడీతో గుర్తింపు తెచ్చుకున్న Hyper aadi బీటెక్ పూర్తి చేశారు. 

212

బుల్లితెర సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న సుడిగాలి సుధీర్ జస్ట్ ఇంటర్మీడియట్ చదివారు. Sudigali sudheer కుటుంబ పోషణ కోసం ఆయన చదువు త్యాగం చేసి, మ్యాజిక్ షోలు ఇస్తూ ఉండేవాడు. హీరోగా కూడా పలు చిత్రాల్లో నటిస్తున్న సుధీర్ కెరీర్ పీక్స్ లో ఉంది. 

312

ఆటో పంచ్ లకు ఫేమస్ అయిన రామ్ ప్రసాద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదివారు. జబర్దస్త్ టీమ్స్ లో సుడిగాలి సుధీర్ టీం కి మంచి డిమాండ్ ఉంది. సుధీర్, గెటప్ శ్రీను పంచ్ లకు అవసరమైన స్క్రిప్ట్స్ రాసేది రామ్ ప్రసాద్ నే. 

412

ఎపిసోడ్ కి ఓ గెటప్ లో కనిపించే గెటప్ శ్రీనుకు మామూలు ఫాలోయింగ్ లేదు. మంచి యాక్టర్, మిమిక్రి ఆర్టిస్ట్ అయిన శ్రీను కూడా కేవలం ఇంటర్మీడియట్ తో చదువు ఆపేశారు. Get up srinu కూడా హీరోగా చిత్రాలు చేస్తున్నారు. కమెడియన్ గా ఆయనకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. 

512

జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో అదిరే అభి ఒకరు. దర్శకుడిగా కూడా ప్రయత్నాలు చేస్తున్న అదిరే అభి ఇంజనీరింగ్ చదవడం జరిగింది. 

612

జబర్దస్త్ పుట్టినాటి నుండి ఆ షోని వీడకుండా కొనసాగుతున్న కమెడియన్ రాకెట్ రాఘవ. వెండితెర నటుడిగా కూడా రాణిస్తున్న రాఘవ డిగ్రీ చదివి టీచర్ ట్రైనింగ్ చేశారట. ఆ తరువాత నటనపై ఆసక్తితో పరిశ్రమకు రావడం జరిగింది. 

712

ఇక మన ముక్కు అవినాష్ పెద్ద చదువే చదివాడు. బిగ్ బాస్ షో కోసం జబర్దస్త్ కి టాటా చెప్పిన అవినాష్ ఎంబీఏ చదివారు. ముక్కు అవినాష్ ఇటీవల అనూజా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 

812


సీనియర్ జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరైన చలాకీ చంటి డిగ్రీ చదువుతూ మధ్యలో వదిలేశారట.  చంటి అటు వెండితెరపై కూడా కమెడియన్ గా రాణిస్తున్నారు. 

912


గత ఏడాది జబర్దస్త్ నుండి బయటికి వెళ్లిన చమ్మక్ చంద్ర సినిమాలలో బిజీ అయ్యారు. ఈ కమెడియన్ ఇంటర్ వరకు చదివారు. 

1012

 వింటేజ్ గెటప్స్, సూపర్ స్టార్ కృష్ణ యాక్టింగ్ తో సునామి సుధాకర్ ఫేమస్ అయ్యారు. సుధాకర్ డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం. 

1112

మహేష్ వాయిస్ ని అచ్చు గుద్దినట్లు మాట్లాడే బులెట్ భాస్కర్, కృష్ణం రాజు గెటప్ లో ఇరగదీస్తారు. భాస్కర్ డిగ్రీ బికాం చేశారు. 

1212

వయసు పెరిగినా హైట్ పెరగని చిచ్చరపిడుగు నాటీ నరేష్ డిగ్రీ చదువుతూ మధ్యలో మానేశారు. బుల్లితెర బిజీ ఆర్టిస్ట్స్ లో నాటీ నరేష్ ఒకరు. 

Also read ఈ అందానికి అందరూ దాసోహం... అల్లు అరవింద్ అయితే ఏకంగా

Also read కొడుకు వరుణ్ తో దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నాగబాబు... వైరల్ గా వెకేషన్ ఫోటోలు

click me!

Recommended Stories