ఈ అందానికి అందరూ దాసోహం... అల్లు అరవింద్ అయితే ఏకంగా

First Published | Oct 25, 2021, 10:05 AM IST


అల్లు అరవింద్ ని ఇండస్ట్రీలో  టాలెంట్ హంటర్ అంటూంటారు. హీరో,హీరోయిన్స్ ,డైరక్టర్స్ ఎవరైనా ఆయన చూసి ఓకే చేసారంటే వారికి గోల్డెన్ లైఫ్ స్టార్ట్ అయ్యినట్లే. ఆయన్ని చాలా మంది నిర్మాతలు  ఫాలో అవుతారు.  

Sreeleela


పెళ్లి సందడి సినిమాగా పెద్దగా ఎవరికీ నచ్చలేదు. అయితే అందులో హీరోయిన్ జనాలకు తెగ నచ్చేసింది. అందులోనూ రాఘవేంద్రరావు మార్క్ పాటల్లో ఆమెను చూసి థియోటర్స్ లో విజిల్స్ వేస్తున్నారు. 

Sreeleela


దాంతో ఆమె కాబోయే కాజల్ లేదా పూజ హెడ్గే అంటున్నారు. ఆమెకు వరస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఆమె తెలుగు సినిమాలపై పూర్తి దృష్టి పెడుతోంది. రెమ్యునేషన్స్ కూడా భారీగా ఆఫర్ చేస్తున్నారు.


Sreeleela

సినీ ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమచారం మేరకు ఆమె గీతా ఆర్ట్స్ లో మూడు సినిమాలు డీల్ ఓకే చేసినట్లు చెప్తున్నారు. సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కు ఇలా అప్ కమింగ్ హీరోయిన్స్ తో మూడు సినిమాల డీల్ కుదుర్చుకునే అలవాటు ఉంది. 


గతంలో గీతా ఆర్ట్స్ లో తమన్నాకు అలాగే ఆఫర్స్ వచ్చాయి.  కెరీర్ ప్రారంభంలో ఆమెలో టాలెంట్ చూసి డీల్ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయ్యిపోయింది. ఇప్పుడు శ్రీలీల కూడా అదే సిట్యువేషన్ లో ఉంది అంటున్నారు. 

Sreeleela


సాధారణంగా ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లను పరిచయం చేయాలంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తర్వాత పూరి జగన్నాథ్ ఫేమస్ చెప్పవచ్చు. ఈ సినిమాతో అది నిజమే అని మరో సారి ప్రూవ్ అయ్యింది.

Sreeleela

రాఘవేంద్రరావు ఎంతో మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారిని ఇండస్ట్రీలో మంచి సెలబ్రిటీలగా గుర్తింపు పొందేలా చేశారు. ఇప్పుడీమె వంతు వచ్చింది.

Sreeleela


 రాఘవేంద్రరావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి శ్రీలీల అనే హీరోయిన్ పరిచయం చేయబోతున్నారనగానే అందరి దృష్టీ ఆమె పై పడింది. పెళ్లిసందD సినిమా ద్వారా ఈ కన్నడ ముద్దుగుమ్మను తెలుగు తెరకు పరిచయం అవటమే కలిసొచ్చింది.

Sreeleela


ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగులో నటించడానికి కంటే ముందుగా కన్నడలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో నటించాలని ఎన్నో రోజుల నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీకి ఏకంగా రాఘవేంద్రరావు ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడంతో ఎంతో సంబరపడింది.

Sreeleela


దాంతో ఇప్పుడు  సోషల్ మీడియా వేదికగా పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల ఈ మధ్య ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

Sreeleela


ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ పై పలువురు దర్శక నిర్మాతలు కన్నేసి ఉంచారని వారి తర్వాత ప్రాజెక్టులలో ఈమెకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే అల్లు అరవింద్ ఓ అడుగు ముందుకేసారు.

Sreeleela


  శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా శ్రీలీల జంటగా తెరకెక్కిన ఈ పెళ్లి సందD సినిమా ఎలాగున్నా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమా కూడా తన తండ్రి శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమా లాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని పలువురు అంటున్నారు.

Sreeleela


దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో డైరెక్టర్ గౌరీ రోనంకీ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల మంచి నటనను ప్రదర్శించింది. గ్లామర్ తో కూడా మెప్పించింది. అయితే ఓ వివాదం ఇప్పుడు ఆమెను చుట్టుముట్టింది.

Sreeleela


శ్రీలీల నా కూతురు కాదంటూ సూరపనేని శుభాకర రావు చెప్పుకొచ్చారు. శ్రీలీల తన కూతురంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. శ్రీలీల తన మాజీ భార్య కూతురని తాము విడిపోయిన తరువాత శ్రీలీలకు తన మాజీ భార్య జన్మనిచ్చిందని తెలిపారు. తన ఆస్తులపై క్లైమ్ చేయడానికి తన పేరు వాడుతున్నారని ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళతామని హెచ్చరించారు.

Sreeleela


ఇంకా తమ విడాకులపై కేసులు నడుస్తున్నాయని.. తమ విడాకుల కేసులో హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లినట్లుగా సూరపనేని శుభాకరరావు తెలిపారు. 'శ్రీలీల నా కూతరు కాదు. ఆమె నా మాజీ భార్య కూతురు. మేము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చింది. 

Sreeleela


నా ఆస్తులను క్లెయిమ్‌ చేయడానికి ఇంటర్వ్యూలలో నా పేరు వాడుతున్నారు.ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తాము. ఇంకా మా విడాకులపై కేసులు నడుస్తున్నాయి.

Sreeleela


 హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాము. దీనిపై సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు' అంటూ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు తన స్టేట్మెంట్ ను విడుదల చేశారు.

Sreeleela


ప్రస్తుతం శ్రీలీల ...రవితేజ, నక్కిన త్రినాధరావు సినిమా కమిటైంది. అలాగే నితిన్ సరసన, రామ్ సరసన కూడా ఆమెను ఎంపిక చేసినట్లుసమాచారం. చూస్తూంటే ఆమె అతి కొద్ది సమయంలోనే నెక్ట్స్ లెవిల్ కు వెళ్లబోతోంది. 

Sreeleela


అల్లు అరవింద్ ని ఇండస్ట్రీలో  టాలెంట్ హంటర్ అంటూంటారు. హీరో,హీరోయిన్స్ ,డైరక్టర్స్ ఎవరైనా ఆయన చూసి ఓకే చేసారంటే వారికి గోల్డెన్ లైఫ్ స్టార్ట్ అయ్యినట్లే. ఆయన్ని చాలా మంది నిర్మాతలు  ఫాలో అవుతారు. అలాగే ఇప్పుడు ఆయన దృష్టి పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల పై పడింది. ఆమె ఇప్పుడు వరసగా గీతా ఆర్ట్స్ లో మూడు సినిమాల్లో బుక్ అయ్యినట్లు సమాచారం. 

బికినీలో నాగ్ హీరోయిన్ రచ్చ.. రోజురోజుకూ హద్దులు దాటేస్తున్న హాట్ బ్యూటీ

Also read నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే, గతాన్ని గుర్తు చేసుకుంటూ.. సన్నీ లియోన్ హాట్ కామెంట్స్

Latest Videos

click me!