appu movie, puneeth rajkumar
Rakshita Prem-Appu: పునీత్ రాజ్‌కుమార్ 50వ జన్మదినం సందర్భంగా ‘అప్పు’ సినిమాను రీ రిలీజ్ చేశారు. అభిమానులు సినిమాను ఘనంగా స్వాగతించారు. థియేటర్లలో సెలబ్రేట్ చేశారు.
బెంగళూరులోని కొన్ని సెంటర్లలో తెల్లవారుజామున షోలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ హౌస్‌ఫుల్ ప్రదర్శనలు జరిగాయి. వేలాది మంది `అప్పు`(పునీత్ రాజ్‌కుమార్) అభిమానులు ఉదయాన్నే థియేటర్ల ముందు గుమిగూడి పునీత్‌కు జై కొట్టారు. అభిమాన హీరోపై ప్రేమని చాటుకున్నారు.
చాలా చోట్ల పునీత్ కటౌట్‌కు పాలతో అభిషేకం చేశారు. సినిమా ప్రదర్శన ప్రారంభంలో పునీత్ పేరు తెరపైకి రాగానే ఫ్యాన్స్ ఉర్రూతలూగి సంబరాలు చేసుకోవడం అప్పుపై వారి అభిమానానికి నిదర్శనంగా చెప్పొచ్చు.
బెంగళూరులోని మెజెస్టిక్ ప్రాంతంలోని చాలా థియేటర్ల ముందు అభిమానుల జాతర జరిగింది. చాలా మంది టీవీ, సినిమా సెలబ్రిటీలు కూడా అభిమానుల సంబరాల్లో పాల్గొనడం విశేషం. ఈ సినిమా హీరోయిన్ రక్షితా ప్రేమ్ థియేటర్‌లో అభిమానుల మధ్య సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె, ‘అప్పు సినిమా ఇప్పటికీ తాజాగా అనిపిస్తుంది. ఇది ఎవర్ గ్రీన్ స్టోరీ. అప్పు, సుచి మధ్య ప్రేమ కథ అద్భుతమైనది. చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. సినిమా చూస్తూ చూస్తూ, అప్పు జ్ఞాపకం తీవ్రంగా కలిచివేసింది. ఆయన ఈరోజు మనతో ఉండాల్సింది’ అని భావోద్వేగంగా మాట్లాడారు రక్షితా ప్రేమ్.