రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇటీవల పెల్లి చేసుకున్న నేపథ్యంలో రష్మిక మాజీ ప్రియుడు, హీరో రక్షిత్ శెట్టి మొదటి సారి స్పందించారు. రష్మిక పెళ్లి తర్వాత ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
రక్షిత్ శెట్టి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్‌ను ఎనిమిది సార్లు చూశారట. దాని కథనం, ప్రతి పాత్రను అంత లోతుగా తీర్చిదిద్దిన విధానం అద్భుతమని ఆయన అన్నారు. 'నేను ఎవరిపైనా ఒత్తిడి పెట్టను, ఎవరి నుంచీ ఒత్తిడి తీసుకోను. పాత్రలను అర్థం చేసుకోవడానికే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా. నా పాత్రలేంటో నాకు తెలుసు. ఆ పాత్రలా జీవిస్తాను, అందుకే బయట కనిపించను. ప్రస్తుతం రచన చేస్తున్నా' అని రక్షిత్ శెట్టి చెప్పారు.
24
ఒంటరిగా వదిలేస్తేనే సంతోషం
'నన్ను ఎవరూ ప్రశ్నలు అడగనప్పుడు, వివరణలు కోరనప్పుడు, ఒంటరిగా వదిలేసినప్పుడే నేను సంతోషంగా ఉంటాను. పాత్రలను తెరపైకి తెచ్చేటప్పుడు, వాటిలో నేను ప్రవేశించి జీవించడానికి సమయం కావాలి. కాలం, ప్రదేశం, వ్యామోహం వంటి వాటిపై నాకు నమ్మకం లేదు' అని రక్షిత్ శెట్టి స్పష్టం చేశారు.
34
'రిచర్డ్ ఆంటోనీ' సినిమా ఎందుకు ఆలస్యం అవుతోంది?
'రిచర్డ్ ఆంటోనీ' సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుసు. నిరీక్షణ ఎక్కువ కావచ్చు, కానీ నాకు సమయం గడిచినట్టే తెలియడం లేదు. నేను రాసుకుంటాను, ధ్యానం చేస్తాను, ఆ తర్వాత స్క్రిప్ట్‌ను సరిచేస్తాను' అని రక్షిత్ శెట్టి తెలిపారు.
'ఉళిదవారు కండంతే' స్క్రిప్ట్‌ను కేవలం 12 రోజుల్లోనే రాశాను. ఎలాంటి ఒత్తిడి లేకుండా, అమాయకత్వంతో ఆ సినిమా చేశా. అది ఇప్పటికీ 'కల్ట్ సినిమా'గా నిలవడం సంతోషంగా ఉంది. 'రిచర్డ్ ఆంటోనీ' దానికి ప్రీక్వెల్, సీక్వెల్. దీన్ని భారీ స్థాయిలో తీస్తున్నాం, ఇతర దేశాల్లో షూటింగ్ ఉంటుంది. అభిమానులకు ఇది పైసా వసూల్ సినిమా అవుతుంది. ఇందులో మీరు 'రిక్కీ 2.0'ను చూస్తారు' అని రక్షిత్ చెప్పారు.