MSG 50 Days Collections: చిరంజీవి మన శంకర వర ప్రసాద్‌ గారు 50 రోజులు పూర్తి.. ఇప్పటికీ బాక్సాఫీసు షేకింగ్‌

Published : Mar 02, 2026, 12:13 PM IST

చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి వచ్చిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా బాక్సాఫీసు రచ్చ చేస్తోంది. దీనికి ఊహించని కలెక్షన్లు వస్తున్నాయి. 

PREV
16
50 రోజులు పూర్తి చేసుకున్న మన శంకర వర ప్రసాద్‌ గారు

చిరంజీవికి సరైన మూవీ పడితే బాక్సాఫీసు వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఇటీవల వచ్చిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ నిరూపించింది. కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ లేటెస్ట్ గా యాభై రోజులు పూర్తి చేసుకుంది. అయినా మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ మూవీ ఇప్పటికీ అదిరిపోయే కలెక్షన్లని రాబడుతుండటం విశేషం. తాజాగా టీమ్‌ సినిమాకి సంబంధించిన అధికారికంగా కలెక్షన్లు వెల్లడించింది.

26
మన శంకర వర ప్రసాద్‌ గారు టీమ్‌ చెప్పిన కలెక్షన్లు

టీమ్‌ చెప్పిన లెక్కల ప్రకారం `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.400కోట్లు వసూళ్లని రాబట్టింది. అంతేకాదు నార్త్ అమెరికాలో దీనికి రూ.3.5 మిలియన్‌ డాలర్లు వచ్చాయట. అలాగే బుక్‌ మై షోలో 3.8మిలియన్స్‌కి పైగా టికెట్లు అమ్ముడు పోయినట్టు వెల్లడించింది. ఈ మేరకు ఒక నోట్‌ని పంచుకుంది టీమ్‌. చిరంజీవి, అనిల్‌ రావిపూడి కెరీర్‌లోనే ఇది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా పేర్కొంది. 

36
మన శంకర వర ప్రసాద్‌ గారు అరుదైన రికార్డులు

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు 109 సెంటర్లలో ఇది యాభై రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. సినిమా విడుదలై ఇన్ని రోజుల తర్వాత కూడా ఈ స్థాయిలో థియేటర్లలో మూవీ రన్‌ కావడం అరుదైన రికార్డుగా చెప్పొచ్చు. అదే సమయంలో బుక్‌మై షోలో ఒక రీజినల్‌ ఫిల్మ్ 3.8మిలియన్స్ కిపైగా టికెట్లు అమ్ముడు పోవడం కూడా రికార్డుగా చెబుతున్నారు. మొత్తంగా చిరంజీవి చిత్రం ఒక అరుదైన రికార్డుని క్రియేట్‌ చేసిందని చెప్పొచ్చు.

46
మన శంకర వర ప్రసాద్‌ గారు వాస్తవ కలెక్షన్లు

ఇదిలా ఉంటే బాక్సాఫీసు లెక్కల సైట్లు సైట్‌ సాక్నిల్క్, కోయిమోయ్‌ వెల్లడించిన లెక్కల ప్రకారం ఈ మూవీ ఇప్పటి వరకు, అంటే యాభై రోజులకుగా ఏకంగా రూ. 306కోట్లు రాబట్టిందట. ఓవర్సీస్‌లో దీనికి రూ.43కోట్లు రాగా, ఇండియాలో రూ.219కోట్ల నెట్‌, 260కోట్ల గ్రాస్‌ వసూలు చేసిందని సమాచారం. సినిమాకి రూ.120కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. దాదాపు రూ.60-70కోట్ల మధ్య లాభాలు వచ్చినట్టు సమాచారం.

56
జీ 5 ఓటీటీలో మన శంకర వరప్రసాద్‌ గారు మూవీ

ఇక ఈ సినిమా ఓటీటీలో కూడా రచ్చ చేస్తుంది. జీ 5లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ప్రారంభంలో టాప్‌లో ఉన్న ఈ చిత్రం ఇప్పుడు టాప్‌ 10లో దూసుకుపోతుంది. వ్యూస్‌ పరంగానూ రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. ఓ వైపు ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ మరోవైపు థియేటర్లలో కూడా 50 రోజులు పూర్తి చేసుకోవడం, ఇప్పటికీ ప్రదర్శించబడటం విశేషంగా, ఇదొక సరికొత్త రికార్డుగా చెప్పొచ్చు. అంతేకాదు ఈ శనివారం టీవీలోకి కూడా వచ్చింది.

66
మన శంకర వర ప్రసాద్‌ గారు టీమ్‌ ఇదే

చిరంజీవి హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్‌ స్పెషల్‌ రోల్‌ చేశారు. చిరు కూతురు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. సంక్రాంతి పండక్కి మంచి ఫ్యామిలీ, ఫన్‌ కంటెంట్‌తో ఈ మూవీని రూపొందించారు అనిల్‌. మహిళా ప్రేక్షకులకు, చిరంజీవి అభిమానులకు, అలాగే చిన్నపిల్లల్ని అలరించేలా ఈ మూవీ ఉండటంతో అన్ని వర్గాల ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories