వాళ్లకు మాత్రమే అనుమతి...
'అభిమానులు దయచేసి సహకరించాలి. ఈ రిసెప్షన్‌కు ఆహ్వాన పత్రిక ఉన్నవారికే ప్రవేశం. రాజకీయ నాయకులు, కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం, హిందీ సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. కఠినమైన సూచనల మేరకు అతిథుల జాబితాను పరిమితం చేశాం. మీ ప్రేమ, ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి' అని విరోష్ జంట కోరింది.
'ఆహ్వానం లేని వారు దయచేసి వేడుక జరిగే ప్రదేశానికి రావొద్దు. ఇది కేవలం భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం. పోలీసులు, స్థానిక భద్రతా సిబ్బంది మాకు కఠినమైన సూచనలు ఇచ్చారు. ఎలాంటి గందరగోళం లేకుండా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలనుకుంటున్నాం. దీనికి అందరి సహకారం అవసరం' అని వారు విజ్ఞప్తి చేశారు.
'వేడుకకు ఎక్కువ మంది జనం వస్తే, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆంక్షలు తప్పనిసరి అయ్యాయి' అని విరోష్ జంట వివరించింది. ఇదే సమయంలో, తమపై ప్రేమ చూపిస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.