ఈరోజు ఎపిసోడ్ లో దివ్య, విక్రమ్ పంపిన లవ్ లెటర్ ని చూస్తూ చదువుతూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి సరస్వతి వస్తుంది. అప్పుడు సరస్వతిని హత్తుకున్న దివ్య అలిగి ముఖమంతా ఒకలాగా పెట్టడంతో ఎందుకు అలిగావు దివ్య అని అడుగుతుంది సరస్వతి. ఏమైంది రా తల్లి ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఈ అమ్మమ్మ అంత పెద్ద తప్పు ఏం చేసింది అని అనగా నీకు తెలియదా అని అంటుంది దివ్య. మనవరాలు పెళ్లి అంతే అమ్మమ్మ పెట్టే అని సర్దుకుని వచ్చి నెల రోజుల ముందే కూర్చుంటుంది.