
ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసు కారులో వెళ్తుండగా ఒక అమ్మాయి రిషి వాళ్ళ కారు వెనకాల పరిగెడుతూ హలో ఎక్స్క్యూజ్మీ హెల్ప్ కాపాడండి అని గట్టిగటిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు రిషి వాళ్ళు కారు ఆపి ఏం జరిగింది అనడంతో ఇద్దరు రౌడీలు నా వెనకాల పడుతున్నారు సార్ నన్ను చంపాలని చూస్తున్నారు కాపాడండి అని అంటుంది. అప్పుడు రిషి కొంచెం వాటర్ ఇచ్చి పోలీసులకు ఫోన్ చేస్తాను రిమైనింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు అని అనగా పోలీసులకు వద్దు సార్ మా అమ్మ నాన్నలకు పోలీస్ కేసులో అవి ఇష్టం ఉండదు వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను జాబ్ చేస్తున్నాను అని అబద్ధాలు చెబుతూ ఉంటుంది.
అప్పుడు ఆ అమ్మాయి మాటలకు వసు, రిషి ఇద్దరు ఆశ్చర్యపోతారు. అప్పుడు అమ్మాయి మాటలను నిజం అని నమ్ముతారు. సార్ నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టండి సార్ అనగా సరే అని రిషి వాళ్లు అక్కడి నుంచి బయలు దేరుతారు. మరోవైపు జగతి, మహేంద్ర ఇద్దరు రిషి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా రావట్లేదు ఇంకా చాలా కాలం తర్వాత కలిసారు కదా ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నారేమో అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు మహేంద్ర ఫోన్ చేయమని చెప్పగా వద్దు మహేంద్ర వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో అనుకుంటూ ఉండగా ఇంతలోనే వసుధార ఫోన్ చేసి మేడం నేను రిషి సార్ మధ్యలో వస్తున్నాము ఒక చిన్న పని పడింది మీరందరూ భోజనం చేసి పడుకోండి అని చెబుతుంది.
ఇంతలోని దేవయాని జగతి దగ్గరకు వచ్చి ఎవరు అనగా వసు అనడంతో ఏమంటా ఎక్కడ వస్తున్నారు అని అంటుంది అనగా వాళ్ళు రావడం లేదంటే అక్కయ్య ఏదో చిన్న పని పడిందంట అనగా ఏం పని అనడంతో నేను అడగలేదు అక్కయ్య అనగా అడగాలి కదా జగతి అని అంటుంది దేవయాని. అప్పుడు రిషి మీద లేనిపోని ప్రేమను ఒలకబోస్తూ అలా వదిలి పెట్టేస్తారా అడగాలి కదా అని అంటుంది దేవయాని. అప్పుడు దేవయానికి రివర్స్లో కౌంటర్ ఇస్తూ మాట్లాడుతుంది జగతి. ఇంతలో ధరణి అక్కడికి రావడంతో అందరూ కలిసి భోజనం చేయడానికి వెళ్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని డ్రాప్ చేయడానికి రిషి వసు లు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు.
థాంక్యూ సార్ మీరే లేకపోయి ఉంటే ఈరోజు నా జీవితం నాశనం అయ్యేది అనడంతో వసు, రిషి ఆ అమ్మాయికి ధైర్యం చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంటికి వెళ్తాము అన్నా కూడా వినకుండా నా సాటిస్ఫాక్షన్ కోసమైనా ఇంట్లోకి వచ్చి కాఫీ తాగండి సార్ అని అంటుంది. అప్పుడు వసుధార రిషి చేసేదేమీ లేక ఇంట్లోకి కాఫీ తాగడానికి వెళ్తారు. అప్పుడు ఆ అమ్మాయి తెలివిగా వసుధార, రిషి ని మా అమ్మ నాన్నలను పరిచయం చేస్తాను రండి సార్ అని పిలుచుకుని వెళుతుంది. అప్పుడు రిషి, వసుధార ఒక గదిలోకి వెళ్తారు. అప్పుడు ఆ అమ్మాయి ఏమి తెలియనట్టుగా నాన్నగారు లేవండి అనడంతో ఇద్దరు రౌడీలు ముసుగు తీయడంతో అది చూసి రిషి వసుధార షాక్ అవుతారు. అప్పుడు రిషి కి ముసుగు వేయాలని చూడగా రిషి వారిద్దరిని చితక బాదుతాడు.
అప్పుడు వసుధార ఒంటరిగా ఉండడంతో ఆ అమ్మాయి వెళ్లి వసుధార మెడపై కత్తి పెట్టి బెదిరించి చంపేస్తాను దగ్గరికి రావద్దు అని అంటుంది. రేయ్ ఫోను కార్ కిస్ తీసుకోండి రా అని చెప్పడంతో రిషి దగ్గర ఫోను కారుకి తీసుకుంటారు. అప్పుడు రిషి తనని ఏం చేయొద్దు అని అంటాడు. అప్పుడు వసు, రిషిని గదిలోకి నెట్టేసి తలుపు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు డోర్ తీయండి అని వసుధార, రిషి ఇద్దరు గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడు రిషి చుట్టూ ఎవరైనా ఉన్నారా అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు. ఎవరు సార్ ఆ అమ్మాయి మనల్ని ఇంత ప్లాన్ గా ఇక్కడ బంధించింది అనగా అదే ఆలోచిస్తున్నాను వసుధార అని అంటాడు రిషి. ఎలా అయినా మనం ఇక్కడి నుంచి బయట పడాలి సార్ అని అంటుంది.
నాకు అది అర్థం కావడం లేదు మనకు తెలియని శత్రువులు ఎవరా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు రిషి. మరోవైపు సౌజన్య రావు ఈ రోజుల్లో మంచిగా ఉంటే కాదు మిస్టర్ రిశేంద్ర భూషణ్ అనుకుంటూ ఉంటాడు. అసలు ఎవరి ఇదంతా చేశారో ఎందుకో ఇదంతా చేశారు అసలు ఏం ఉద్దేశిస్తున్నారు అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు. మన కాలేజీలో జరిగిన గురించి నాకు తెలుసు అతని వెనుక ఎవరు ఉన్నారో కూడా నాకు తెలుసు అనడంతో అవును వసుధార మారతారని అనుకున్నాను కానీ ఇలా చీప్ గా ట్రై చేస్తారని అనుకోలేదు అని అంటాడు రిషి. మన కాలేజ్ ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తున్నారు అని అంటాడు రిషి. అప్పుడు వసుధార టెన్షన్ పడుతుండగా రిషి ధైర్యం చెబుతూ ఉంటాడు.
మరొకవైపు సౌజన్య రావ్ నవ్వుకుంటూ నిన్ను ఎవరు ట్రాప్ చేశారు ఎవరికి కిడ్నాప్ చేశారని ఆలోచిస్తున్నావు కదా నిన్ను కిడ్నాప్ చేసింది ఈ సౌజన్య రావు అనుకుంటున్నాడు. ఎప్పటినుంచో నీ పతనం కోసం ఎదురుచూస్తున్నాను ఇవాళ ఆ ఛాన్స్ దొరికింది రాజు రాణి ఇద్దరినీ నేను బంధించి చెక్మేట్ పెట్టాను అనుకుంటున్నాడు. ఇంతలోనే అతనికి ఒక వ్యక్తి ఏమయింది అప్డేట్ రాలేదు అని మెసేజ్ చేయగా చెప్పిన పని పూర్తి అయ్యింది అని మెసేజ్ చేస్తాడు సౌజన్య రావు. రిషి వాళ్ళ సంగతి చూడాలి అంటూ మెసేజ్లు చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. రౌడీలకు ఫోన్ చేసి జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు సౌజన్య రావు.