సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `రోబో` సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అప్పటి వరకు విడుదలైన ఇండియన్ మూవీస్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 14ఏళ్ల క్రితం మూడు వందల కోట్లు అంటూ సంచలనమనే చెప్పాలి. ఆ అరుదైన రికార్డు సాధించిన ఘనత రజనీకాంత్, శంకర్‌లకే దక్కింది. రోబో టెక్నాలజీ బేస్డ్ గా ఈ మూవీ రూపొందిన విషయెం తెలిసిందే. హాలీవుడ్‌లో వచ్చే ఇలాంటి సినిమాలు ఇప్పుడు మన ఇండియాలో, అది కూడా సౌత్ లో రావడం అంతా ఆశ్చర్యపోయారు. పైగా అంత బాగా రావడం గొప్ప విషయమనే చెప్పాలి.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
shankar, rajini
అయితే ఈ ఆఫర్ వచ్చినప్పుడు రజనీకాంత్ మొదట రిజెక్ట్ చేయాలనుకున్నారు. దర్శకుడు శంకర్ నుంచి కాల్ వచ్చినప్పుడు శంకర్‌ని కలిశాడట రజనీ. ఇలా `రోబో` సినిమా చేస్తున్నాం, అందులో మీరు చేయాలన్నాడట శంకర్. దీంతో రోబో సినిమా నేనుచేయడమేంటి? విలన్ పాత్ర కోసం అడుగుతున్నారేమో అనుకున్నారట. ఎందుకంటే అప్పటికే బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్‌తో సినిమా చేయబోతున్నారనే రూమర్లు వచ్చాయి. దీంతో షారూఖ్ హీరోగా చేస్తే, విలన్‌గా తనని అడుగుతున్నారేమో అనుకున్నారట. శంకర్ అడగ్గానే విలన్ పాత్రకి అడుగుతున్నారే, ఎలా నో చెప్పేది, పైగా శంకర్‌కి నో చెప్పడం చాలా కష్టం, ఇప్పుడు ఎలా అని మనసులో అనుకున్నారట. ఎందుకో ధైర్యం చేసి హీరో అని ఏదో చెప్పబోయారట. అంతే ఆ విషయం పూర్తిగా చెప్పకుండాగానే `ఆ హీరోగానే` అన్నారట రజనీకాంత్.
దెబ్బకి సూపర్ స్టార్ షాక్. లోపల ఆనందం ఉంది. కానీ బయటకు ఎలా అని అడిగారట. నేను ఎలా చేస్తాను సర్, సెట్ అవుతానా? ఆ సిక్స్ ప్యాక్‌లు అవన్నీ నా వల్ల కాదు అన్నాడంట. దీంతో శంకర్, నువ్వేమీ చేయోద్దు నీ స్పీడ్, నీ స్టయిల్ కావాలి. మిగిలినది తాను చూసుకుంటానని అన్నాడట. మొదట కాస్త అహిష్టం ప్రదర్శిస్తూనే ఓకే చెప్పాడట. విలన్‌గా అనుకుంటే హీరో అని అన్నాడు. అదే పెద్ద షాక్‌లో ఉన్న రజనీకి మరో షాక్ ఇచ్చాడట శంకర్. సర్ హీరోయిన్ ఎవరు అని అడిగాడట రజనీ. వెంటనే ఐశ్వర్యా రాయ్ అన్నాడట. రజనీకాంత్ షాక్‌లోకి వెళ్లిపోయాడు. సర్ నన్ను జోకర్‌ని చేయకండి సర్ అని అన్నాడట. అప్పటికే శంకర్‌తో `శివాజీ` సినిమా చేశాడు కాబట్టి మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాడట రజనీకాంత్. 2010లో విడుదలైన ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆరేళ్ల క్రితం `రోబో`కి సీక్వెల్ గా `2.0` సినిమాని తీసుకొచ్చారు. టెక్నాలజీ, ప్రకృతి మధ్య యుద్దం ప్రధానంగా తెరకెక్కించిన ఈ మూవీలో రజనీకాంత్ రోబోగా నటించగా, అక్షయ్ కుమార్ నెగటివ్ రోల్ చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. 3డీలోనూ రూపొందించినా, బేసిక్ ఎమోషన్స్ మిస్ కావడంతో సినిమా ఫలితం తేడా కొట్టింది. ఆ తర్వాత శంకర్, కమల్ హాసన్‌తో `ఇండియన 2`సినిమా చేశారు. అనేక అడ్డంకుల నడుమ సినిమాని పూర్తి చేశారు. రెండు భాగాలుగా తీసుకొచ్చారు. ఇప్పటికే `ఇండియన్ 2` విడుదలై డిజాస్టర్ అయ్యింది. `ఇండియన్ 3`ని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు.
ఇక రజనీకాంత్ గతేడాది `జైలర్`తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని అందుకున్నారు. ఇప్పుడు `వేట్టయన్` సినిమాలో నటిస్తున్నారు. `జై భీమ్` ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా `గేమ్ ఛేంజర్` మూవీని రూపొందిస్తున్నారు. ఇది క్రిస్మస్ కానుకగా విడుదల కాబ
Read more: రామ్ చరణ్ డాన్స్ చేస్తాడా? నాకు పెద్ద డౌట్, చాలా టెన్షన్ పడ్డాం.. బావ ముందే అల్లు అర్జున్ కామెంట్