ఎన్టీఆర్ మరో సారి అదే టాపిక్, అక్కడ నుంచి కాల్ వచ్చిందా?

First Published | Oct 8, 2024, 11:22 AM IST

అదే విషయం మరోసారి  దేవర సక్సెస్ మీట్ లో భాగంగా  ఇచ్చిన ఇంటర్వూలలోనూ చెప్పుకొచ్చారు.  రీసెంట్ గా జరిగిన మీడియా మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ...తనకు  పాపులర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో చేరాలనే తన కోరికను చెప్పుకొచ్చాడు. 

Jr NTR , Marvel Cinematic Universe, Iron man


ప్రస్తుతం దేవర సక్సెస్ తో దూసుకుపోతున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్నారు. ఈ  క్రమంలో  ఆయన తర్వాత చేసే సినిమాలు ప్లానింగ్ కూడా ఉంటోంది. ఇకపై వచ్చే  సినిమాలు కూడా ఇదే రేంజ్ లో పాన్ ఇండియా స్థాయిలో రానున్నాయి.

ముఖ్యంగా ఎన్టీఆర్ బాలీవుడ్ లో తొలిసారిగా నటిస్తున్న వార్2 ఇప్పటికే హాఫ్ ఆఫ్ ది పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వచ్చే సంవత్సరం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రశాంత్ నీల్‌, ఎన్టీఆర్ మూవీ కూడా డిసెంబర్ నుంచి షూటింగ్ కి వెళ్లనుంది. దేవర2 షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. అదే క్రమంలో ఎన్టీఆర్ దృష్టి ఇండియాని దాటి హాలీవుడ్ వైపు మళ్లిందని అనిపిస్తోంది. అందుకు ఎవిడెన్స్..ఆయన రీసెంట్ గా మాట్లాడిన మాటలు, కామెంట్సే. 

Jr NTR , Marvel Cinematic Universe, Iron man


 RRR మూవీతో ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అమెరికా, జపాన్ లోనూ ఈ చిత్రం హిట్ కావడంతో అక్కడ కూడా సెలబ్రిటీగా మారిపోయారు జూనియర్ ఎన్టీఆర్. RRRలోని నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో అమెరికాలో మూవీ టీమ్ ఉన్నప్పుడు వరుసబెట్టి హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తారక్.. తన మనసులో మాట బయటపెట్టారు. తనకు మార్వెల్ మూవీస్ లో చేయాలనే కోరిక ఉందంటూ చెప్పారు ఎన్టీఆర్.


Ntr, V.V Vinayak, Aadi


RRR  అవార్డ్స్ ప్రీషోలో ఒక రిపోర్టర్ ఎన్టీఆర్ ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఎంటర్ అవుతున్నారా అంటే వెయిటింగ్ ఫర్ ఏ కాల్ అన్నట్లు తారక్ ఆన్సర్ ఇచ్చాడు. దాంతో  ఎన్టీఆర్, బ్లాక్ పాంథర్ పాత్రలో చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.  చాడ్విక్ బోస్మేన్ చనిపోయిన తర్వాత బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ ని పండించగల హీరో దొరకలేదు.

రీసెంట్ గా బ్లాక్ పాంథర్ సీరీస్ నుంచి ‘వాకండా ఫరెవర్’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇంటర్నేషనల్ రీచ్ ఉన్న ఈ బ్లాక్ పాంథర్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడని అబిమానులు మురిసిపోయారు. ఆ పాత్రలోని ఎమోషన్స్ ఇండియన్ ఎమోషన్స్ కి చాలా దగ్గరగా ఉంటాయి. ఇదిలా ఉంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో తనకి ”టోనీ స్టార్క్” పాత్ర అంటే చాలా ఇష్టం అని ఎన్టీఆర్ చెప్పాడు.

NTR, SS Rajamouli, Devara


అయితే అదే విషయం దేవర సక్సెస్ నిమిత్తం ఇచ్చిన ఇంటర్వూలలోనూ చెప్పుకొచ్చారు.  రీసెంట్ గా జరిగిన మీడియా మీట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ...తనకు  పాపులర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో చేరాలనే తన కోరికను చెప్పుకొచ్చాడు. మార్వెల్ ప్రపంచంలో భాగమవటానికి తను ఎంతో ఇష్టపడతానని.. ఎందుకంటే మార్వెల్ నాకు చాలా ప్రత్యేకమైనదని అందులో ఐరన్ మాన్ కచ్చితంగా నాకు ఇష్టమైన పాత్రలో ఒకటి అని...

 ముఖ్యంగా మనకు సూపర్ పవర్ ఉండవలసిన అవసరం లేదు శక్తులను కలిగి ఉండడానికి మనం దేవుళ్ళు కాదు.. అందరికీ తెలుసు అతను కేవలం మనిషి అని ఆయన తన మనసుతో అది సాధించాడు ప్రతి ఒక్కరు సూపర్ హీరోలు కావటం చాలా సులభం నువ్వు నేను మేమంతా కాబట్టి మార్వెల్ నాకు చాలా ఎక్సైట్ చేసింది నేను కచ్చితంగాయూనివర్స్ లో భాగం కావాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

NTR, SS Rajamouli, Devara


ఇక మార్వెల్ స్టూడియోస్.. సూపర్ హీరోస్ సినిమాలకు కేరాఫ్. ఐరన్ మ్యాన్ నుంచి అవేంజర్స్ వరకూ అనేక యాక్షన్ ఓరియెంటెడ్ ఫాంటసీ చిత్రాలను నిర్మించింది. దాదాపు అన్నీ బ్లాక్ బస్టర్లే. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, హల్క్.. ఇలా ఎన్నో సూపర్ హీరో క్యారెక్టర్లను క్రియేట్ చేసింది మార్వెల్ స్టూడియోస్. అలాంటి మార్వెల్ మూవీస్ లో నటించాలని ఉందంటూ తారక్ తన కోరికను బయటపెట్టాడు.

RRR, దేవర తో వరల్డ్  వైడ్ క్రేజ్ సంపాదించిన ఎన్టీఆర్ కనుక మార్వెల్ సినిమాలో నటిస్తే? ఆ ఆలోచనే ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. తార‌క్ త‌దుప‌రి దేవ‌ర 2ని పూర్తి చేసి విడుద‌ల చేయాల్సి ఉంది. కాన్వాస్ ప‌రంగా మొద‌టి భాగం కంటే చాలా పెద్ద స్పాన్ తో ఉంటుంద‌ని కూడా తార‌క్ వెల్ల‌డించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే ముందు వార్ 2 ప‌నుల్ని తార‌క్ పూర్తి చేస్తాడు.

Latest Videos

click me!