మా అమ్మ మళ్లీ చనిపోయింది, కన్నీళ్లు పెట్టిస్తోన్న రాజేంద్ర ప్రసాద్ మాటలు

First Published | Oct 8, 2024, 11:31 AM IST

 గాయత్రీ కేవలం 38 సంవత్సరాలకే మరణించడం.. రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేసింది. 

Rajendra Prasad, tollywood, death


ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్‌ కుమార్తె గాయత్రి(38) గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఛాతీలో నొప్పి రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఒంటిగంటకు మరణించారు.

రాజేంద్రప్రసాద్‌ దంపతులకు కుమార్తెతోపాటు కుమారుడు బాలాజీ ఉన్నారు. గాయత్రికి ప్రైవేటు ఉద్యోగి రాజ్‌కుమార్‌తో వివాహం కాగా వారికి కుమార్తె సాయితేజస్వి ఉన్నారు.  గాయత్రి అంత్యక్రియలు కేపీహెచ్‌బీలోని కైలాసవాసంలో ఆదివారం నిర్వహించారు. ఈక్రమంలో తన కుమార్తె మరణం రాజేంద్రప్రసాద్ తీవ్రంగా కలిచి వేసింది. 


 కూతురు మరణం నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించేందుకు ఇండస్ట్రీ నుంచి పలువురు నటులు ఆయన ఇంటికి వెళ్ళారు. అలనాటి నటి రమాప్రభతో పాటు మరికొందరు మహిళా నటులు రాజేంద్రప్రసాద్ ను నిన్న కలసిన సందర్భంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'మా అమ్మ మళ్లీ చచ్చిపోయింది..పంపించేసి వస్తా' అని వారితో చెప్పారు. వారు ఆయనను ఓదార్చారు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అతన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో చూసిన వారంతా ఆయనకు సానూభూతిని చెబుతున్నారు.
 


Rajendra Prasad


ఓ సినిమా ఈవెంట్ లో తన కూతురు గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయ్యాడు. నా పదేళ్ల వయసులోనే మా అమ్మ గారు చనిపోయారని, దీంతో నా కూతురిలోనే అమ్మను చూసుకున్నానన్నారు. కానీ ఆమె ప్రేమించిన వాడితో వెళ్లిపోయిందని, ఇప్పుడు నాకు నా కూతురికి మాటలు లేవని,

ఈ సినిమాలో అమ్మ పాటను తన కూతురిని ఇంటికి పిలిపించి నాలుగుసార్లు వినిపించానని రాజేంద్రప్రసాద్ చెప్పడం ఆయనకు కూతురు పట్ల ఉన్న ప్రేమను చాటింది. తన కామెడితో ప్రేక్షకులను నవ్వించే ఆయన ఇప్పుడు అమ్మలాంటి కన్న కూతురు గుండెపోటుతో చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.


రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి వృత్తి రీత్యా డాక్టర్. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు తననీ కాదనీ, ప్రేమ పెళ్లి కారణంగా రాజేంద్రప్రసాద్ తో కాస్త విభేదాలు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ మధ్య కాలంలో కాస్త కలుసుకున్నారు. గాయత్రికి ఓ కూతురు ఉంది. ఆ చిన్నారి 'మహానటి' సినిమాలో జూనియర్ సావిత్రిగా నటించింది. ఒక్క సినిమాతోనే ఓ స్పెషల్ ఐడెంటి క్రియేట్ చేసుకుంది. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి.
 

రాజేంద్రప్రసాద్ గతంలో తన కూతురు గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరలవుతోంది. గతంలో 'బేవార్స్' అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఆ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై రాసిన పాట గురించి మాట్లాడుతూ తన కూతురు గాయత్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

" ఒక్క వ్యక్తికి తల్లి లేకపోతే.. తన కూతురులో తన తల్లిని చూసుకుంటాడు. నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయారు. ఆ తర్వాత నాకు పుట్టిన కూతురిలోనే మా అమ్మను చూసుకున్నా. బేవార్స్ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై రాసిన పాట విని చాలా ఎమోషనల్ అయ్యాను.

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 


నాకు ఒక్కేక్క కూతురు దాని పేరు గాయత్రి. కానీ కొన్నాళ్ల క్రితం తన కూతురు ఒకరిని ప్రేమించి వాడితో వెళ్ళిపోయింది. ఆ సమయం నుంచి నా కూతురితో నాకు మాటల్లేవు. అయినా నా కూతుర్ని ఇంటికి పిలిపించి, నా కుతూరు ముందు కూర్చోని ఈ సినిమాలోని 'అమ్మ' పాటను నాలుగు సార్లు విపించాను"అంటూ రాజేంద్ర ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా రాజేంద్రప్రసాద్ కు తన కూతురు పై ఎంత ప్రేమ ఉందో అంటూ.. నెటిజన్లు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
 

Latest Videos

click me!