మెగాస్టార్ చిరంజీవి `ఖైదీ` చిత్రం తర్వాత వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చారు. యాక్షన్, పాటలు, సెంటిమెంట్, ఎమోషన్స్, తన మార్క్ కామెడీని మేళవిస్తూ సినిమాలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా మాస్ పాటలతో ఆడియెన్స్ ని ఉర్రూతలూగించారు. అప్పట్లో చిరంజీవి సినిమాలంటే థియేటర్లలో పండగే పండగ. ఫ్యాన్స్ పాటలని బాగా ఎంజాయ్ చేసేవారు. మళ్లీ మళ్లీ పాటలను రిపీటెడ్‌గా వెయించుకుని డాన్సులు చేసేవారు. అలా దాదాపు రెండు దశాబ్దాలపాటు తన హవాచూపించారు చిరు.
25
మార్పు కోసం కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేసిన చిరంజీవి
అయితే వరుసగా సేమ్ సినిమాలు రిపీట్ అవుతున్నాయి. ఒకేతరహా సినిమాలు చేయాల్సి వస్తోందని చెప్పి ఆయన రూట్ మార్చారు. మధ్య మధ్యలో ఒకటి అర కంటెంట్ బేస్డ్, ఆర్ట్ తరహా సినిమాలు చేశారు. చిరంజీవి అంటే కమర్షియల్ హీరోగా ముద్ర పడింది. కానీ ఆయన ఆ ఇమేజ్ నుంచి బయటపడాలని చెప్పి కంటెంట్, ఎమోషనల్ మూవీస్ చేశారు. `శుభలేఖ`, `స్వయంకృషి` వంటి చిత్రాల తర్వాత కె విశ్వనాథ్‌తో `ఆపద్బాంధవుడు` చిత్రం చేశారు. వీరి కాంబోలో వచ్చిన మూడో చిత్రమిది.
35
కమల్ హాసన్‌తో చేయాల్సిన `ఆపద్భాంధవుడు`
అయితే ఈ సినిమా కమల్ హాసన్ కోసం అనుకున్నాడు దర్శకుడు కె విశ్వనాథ్. కమల్ అప్పట్లో చాలా టాప్‌లో ఉన్నారు. రజనీకాంత్‌ని మించిన స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. అంతేకాదు కె విశ్వనాథ్‌తో మంచి ర్యాపో ఉంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా విజయం సాధించింది. అందులో భాగంగానే కమల్ హాసన్ కోసం `ఆపద్బాంధవుడు` స్క్రిప్ట్ రాసుకున్నారు విశ్వనాథ్. అయితే అప్పట్లో మార్పు కోసం చిరంజీవి ఇలాంటి కథల కోసం చూస్తున్నారు. విశ్వనాథ్‌తోనూ ఇలాంటి చర్చ జరిగింది. దీంతో కమల్ తో చేయడానికి ముందే చిరంజీవితో చర్చ జరిగింది. ఈ చర్చల్లో భాగంగా ఈ స్క్రిప్ట్ గురించి డిస్కషన్ జరిగింది.
కమల్ తో ఈ సినిమా చేస్తున్నానని విశ్వనాథ్ చెప్పడంతో తాను చేస్తానని పట్టుబట్టాడట చిరు. ఇలాంటి సినిమాలు చేయాలని ఉందని తన ఆసక్తిని వెల్లడించారు. అలా `ఆపద్బాంధవుడు` మూవీ చిరంజీవి చేశారు. మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా నటించింది. ఆద్యంతం ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. ఇది భారీ అంచనాల మధ్య 1992 అక్టోబర్ 9న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రారంభం నుంచి మిశ్రమ స్పందనలభించింది. చిరుని ఇలాంటి ఫైట్లు, పాటలు, డాన్సులు లేని సినిమాలో ఫ్యాన్స్ చూడలేకపోయారు. దీంతో ఫలితం తేడా కొట్టింది. అయితే ఇందులో చిరంజీవి నటనకు నంది అవార్డులు వరించాయి. పలు ఇతర పురస్కరాలు దక్కించుకుంది. కానీ కమర్షియల్‌గా ఇది ఆడలేదు. ఇలా కమల్ హాసన్ చేయాల్సిన మూవీని చిరంజీవి చేసి బోల్తా పడ్డాడు. కాకపోతే ఈ మూవీలో చిరంజీవి నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. నంది అవార్డు కూడా వరించింది.
55
బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో రాబోతున్న మెగాస్టార్
ఇక చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా ఈ రూపొందుతుంది. వశిష్ట దర్శక్వతం వహించారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దీంతోపాటు అనిల్ రావిపూడి దర్శక్వంలో చిరంజీవి మరో చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతుంది. ఇది వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.