రాజేంద్రప్రసాద్‌ని తొలగించి బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన వెంకటేష్‌.. నటకిరీటికి చిరు అన్యాయం చేశాడా?

Published : Aug 20, 2025, 07:43 AM IST

వెంకటేష్‌ హీరోగా వచ్చిన `చంటి` సినిమా అప్పట్లో పెద్ద విజయం సాధించింది. కానీ ఇందులో మొదట అనుకున్న హీరో వెంకటేష్‌ కాదు. చిరంజీవి ఇన్‌ వాల్వ్ కావడంతో లెక్కలు మారిపోయాయి.

PREV
15
వెంకటేష్‌ కోసం రాజేంద్రప్రసాద్‌ తొలగింపు

ఒక హీరోతో సినిమా అనుకుని ఆ తర్వాత మరో హీరోతో చేయడం ఇండస్ట్రీలో సాధారణంగా జరుగుతుంది. కానీ హీరోని తొలగించి సినిమా చేసి హిట్‌ కొడితే తొలగించిన హీరోకి బాధగానే ఉంటుంది. ఓ రకంగా అది ఆయనకు అన్యాయం చేయడమే అవుతుంది. అలా రాజేంద్రప్రసాద్‌ విషయంలో జరిగింది. వెంకటేష్‌ కోసం రాజేంద్రప్రసాద్‌ ని తప్పించాల్సి వచ్చింది. ఇందులో చిరంజీవి హస్తం ఉందని సమాచారం. ఆ కథేంటో చూస్తే.

DID YOU KNOW ?
`సంక్రాంతికి వస్తున్నాం`తో బ్లాక్‌ బస్టర్‌
వెంకటేష్‌ ఈ సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో పెద్ద హిట్‌ కొట్టారు. తన కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్‌గా చెప్పొచ్చు.
25
వెంకటేష్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ `చంటి` మూవీ

వెంకటేష్‌ కెరీర్‌లో పెద్ద హిట్ చిత్రాల్లో `చంటి` ఒకటి. ఇది తమిళంలో వచ్చిన `తంబి` మూవీకి రీమేక్. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని కేఎఎస్‌ రామారావు నిర్మించారు. 1992లో విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ఇందులో వెంకటేష్‌ అమాయకుడిగా నటించాడు. పెద్దవాడయినా మానసికంగా అంతటి మెచ్యూరిటీ లేదు. చిన్నపిల్లాడిగానే ప్రవర్తిస్తాడు. తాను పనిచేసే పెద్దింటి వారి అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంకా చెప్పాలంటే హీరోయిన్‌ ఆయన్ని ప్రేమిస్తుంది. ప్రేమ కోసం వారి అన్నలను ఎదురించడమే ఈ చిత్ర కథ. ఇందులో వెంకటేష్‌కి జోడీగా మీనా నటించింది. ఈ చిత్రం పెద్ద బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. 33 ఏళ్ల క్రితమే ఇది రూ.16కోట్లు వసూలు చేసింది. వెంకీ కెరీర్‌లో టాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

35
`చంటి`కి మొదట అనుకున్న హీరో రాజేంద్రప్రసాద్‌

అయితే ఈ మూవీకి మొదట అనుకున్న హీరో వెంకటేష్‌ కాదు. రాజేంద్రప్రసాద్‌తో చేయాలనుకున్నారు. తమిళంలో `తంబి` సినిమా చూసిన నిర్మాత కేఎస్‌ రామారావు తెలుగు రీమేక్‌ రైట్స్ కొనుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో సినిమా చేయాలని భావించారు. అంతా ఓకే అయ్యింది. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కావాల్సింది. కానీ అంతలోనే ట్విస్ట్. ఈ సినిమాని నిర్మాత రామానాయుడు చూశారు. వెంకటేష్‌కి అయితే బాగుంటుందని భావించారు.

45
చిరంజీవి జోక్యంతో హీరో మారిపోయారు

కేఎస్‌రామారావుని సంప్రదించారు రామానాయుడు. అప్పటికే కమిట్‌ అయిన ప్రాజెక్ట్ కావడంతో ఆయన నో చెప్పారు. రాజేంద్రప్రసాద్‌తో సినిమా స్టార్ట్ చేయాలని భావించారు. ఈ విషయం చిరంజీవి వద్దకు వెళ్లింది. రామానాయుడు సంప్రదించడంతో చిరు రంగంలోకి దిగారు. కేఎస్‌ రామారావుకి.. చిరంజీవికి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ రిలేషన్‌తోనే వెంకీతో సినిమా చేయాలని చెప్పగా, రాజేంద్రప్రసాద్‌ని తప్పించి వెంకటేష్‌తో `చంటి` సినిమా చేశారు. అలా వెంకీ కోసం నటకిరీటికి అన్యాయం చేశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

55
`సంక్రాంతికి వస్తున్నాం`తో బ్లాక్‌ బస్టర్ కొట్టిన వెంకటేష్‌

వెంకటేష్‌ ఇటీవల `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న విషయం తెలిసిందే. తన కెరీర్‌లోనే ఇది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఏకంగా రూ.350కోట్ల వరకు కలెక్షన్లని రాబట్టింది. ఇప్పుడు ఆయన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. వీరి కాంబినేషన్‌లో రాబోతున్న తొలి చిత్రం కావడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories