2 రూపాయలు కూలీ,లగేజ్ మోయించి రజినీకాంత్ ను అవమానించిన వ్యక్తి ఎవరు?

Published : Aug 03, 2025, 03:00 PM IST

2 రూపాయల కూలీ ఇచ్చి, రజినీకాంత్ తో లగేజ్ మోయించిన  వ్యక్తి ఎవరో తెలుసా? హీరో అవ్వకముందు తనను అవమానించి, ఏడిపించిన వ్యక్తి గురించి రీసెంట్ గా రజినీకాంత్ వెల్లడించారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు?

PREV
16

బస్ కండెక్టర్ నుంచి సూపర్ స్టార్ గా

సూపర్ స్టార్ రజినీకాంత్ కష్టపడి పైకి వచ్చారు. సాధారణ బస్ కండెక్టర్ గా ఉద్యోగం చేస్తూ, చాలీచాలని జీతానికి పనిచేసిన శివాజీ అనే వ్యక్తి, ప్రస్తుతం తమిళుల ఆరాధ్య ధైవంగా మారాడు. తమిళ సినిమాలో సూపర్ స్టార్ గా ఎదిగాడు. స్నేహితుడు గోల్డ్ చైన్ అమ్మి మరీ పంపించిన డబ్బులతో చెన్నైలో సినిమా ప్రయత్నాలు చేసిన రజినీకాంత్, ప్రస్తుతం దేశం మెచ్చిన నటుడు అయినా కాని.. తన స్నేహితుడితో మాత్రం సాధారణ శివాజీలానే ప్రవర్తిస్తాడు. ఇక ప్రస్తుతం కూలీ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ రీసెంట్ గా తన సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొని గతం గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

DID YOU KNOW ?
రజినీకాంత్ కోసం స్నేహితుడి త్యాగం
సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం ఆయన స్నేహితుడు బహదూర్ చాలా కష్టపడ్డారు. రజినీకాంత్ ను హీరోను చేయాలని తన జీతంలో సంగం డబ్బులు, చెన్నైలో సినిమా ప్రయత్నాలు చేస్తున్న రజినీకి పంపేవారు. డబ్బులు చాలకపోతే ఆయన గోల్డ్ చైన్ అమ్మి మరీ తలైవాకు డబ్బులు సమకూర్చారు.
26

రజినీకాంత్ కు విలన్ గా నాగార్జున

చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో శనివారం (ఆగస్ట్ 3) నిర్వహించిన ఈ వేడుకలో రజినీ తన జీవితంలో ఎదురైన కష్టాలను, అవమానాలను మళ్లీ గుర్తు చేసుకున్నారు. కూలీ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ వుతోంది.

36

రజినీకాంత్ మాట్లాడుతూ

కూలీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన రజినీకాంత్ మనసు విప్పి మాట్లాడారు. జీవితంలో తాను పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాల గురించి వివరించారు. తాను బాధపడి కన్నీరు పెట్టిన సందర్భం గురించి రజినీకాంత్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. రజినీ చెప్పిన విషయాలు విని స్టేడియంలో ఉన్నవారు కూడా ఎమోషనల్ అయ్చారు.

46

రజినీకాంత్ కన్నీళ్లు పెట్టిన సందర్భం

“ఒకరోజు నేను రోడ్డుపై నిలబడి ఉన్నాను. ఓ వ్యక్తి నన్ను పిలిచి, తన లగేజ్‌ను టెంపో వరకు తీసుకెళ్తావా? అని అడిగాడు. అతడిని చూసి తెలిసినవాడిలా అనిపించింది. తర్వాత అతను నేను ఒకే కాలేజీలో చదువుకున్నామన్న సంగతి తెలిసింది. లగేజ్‌ను టెంపో వరకు తీసుకెళ్లాక అతడు నాకు 2 రూపాయలు ఇచ్చి, ‘అప్పట్లో నీకు ఉన్న అహంకారం ఎవరికీ లేదు. నీకు ఆ రోజులు గుర్తున్నాయా?’ అన్నాడు. ఆ మాటలు విని నా కన్నీళ్లు ఆగలేదు. అది నా జీవితంలో నేను తీవ్రంగా బాధపడిన సంఘటన, నేను పదిపైసలకు 100 కిలోల బియ్యం సంచిని మోసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు ఎంత డబ్బు, ఖ్యాతి ఉన్నా ఇంట్లో శాంతి లేకపోతే అవన్నీ వ్యర్థమే,” అని రజినీ అన్నారు.

56

మూటలు మోసి, కూలి పనులు చేసిన రజినీకాంత్

రజినీకాంత్ తన కెరీర్ ప్రారంభంలో బస్ కండక్టర్‌గా పనిచేశారనే సంగతి తెలిసిందే. ఉద్యోగం రాక ముందు ఆయన కూలీగా, మూటలు మోస్తూ జీవితం గడిపారు.ఈ వేడుకలో రజినీ తన అభిమానుల గురించి కూడా మాట్లాడారు. వరుస ప్లాపుల తర్వాత కూడా అభిమానులు తనపై చూపిన ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. "ప్రేక్షకులు నాకు బ్రతుకుదెరువు ఇచ్చారు. వాళ్ల ప్రేమ నాకు ఎంతో విలువైనది" అని రజినీకాంత్ పేర్కొన్నారు.

66

అంచనాలు పెంచేస్తోన్న కూలీ సినిమా ట్రైలర్

కూలీ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈసినిమా ప్రమోషనల్ వీడియోలకు కూడా భారీగా రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కు ఆడియన్స్ ఉర్రూతలూగిపోతున్నారు. ఈమధ్యనే రిలీజ్ అయిన "మోనికా" సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌లో రజినీ యాక్షన్, సెంటిమెంట్, కామెడీ అన్ని అంశాలతో ఆకట్టుకున్నారు. ఇందులో ప్రత్యేకంగా ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ట్రాక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories