యాదాద్రి ఆలయానికి డిజైన్ అందించిన ఆనంద్ సాయి
ఆనంద్ సాయి ఎవరు అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ఆనంద్ సాయి ప్రమఖ ఆర్ట్ డైరెక్టర్. సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన, 2014లో వచ్చిన ఎవడు సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. అంతకు ముందు నుంచి పవన్ తో ఆనంద్ సాయికి స్నేహం ఉంది. ఆ తరువాత 2015లో పవన్ నటించిన గోపాల గోపాల సినిమాలో పవన్ లుక్‌కు సంబంధించి స్కెచ్ వర్క్ చేశారు. సినిమాలకే పరిమితం కాకుండా, ఆనంద్ సాయి ఇతర ప్రాజెక్టులకూ తన సేవలు అందించారు. ముఖ్యంగా, తెలంగాణలో యాదాద్రి ఆలయ పునః నిర్మాణానికి గుడి డిజైన్ చేసిన ఘనత ఆయనకే దక్కింది.