తెలుగులో 1300 కోట్ల బడ్జెట్ చిత్రాలు.. మృణాల్ ఠాకూర్, తృప్తి డిమ్రి లకు ప్రేక్షకుల నుంచి దిమ్మ తిరిగే దెబ్బ

Published : Aug 03, 2025, 02:30 PM IST

మృణాల్ ఠాకూర్, తృప్తి డిమ్రి ఇద్దరూ తెలుగులో భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటించబోతున్నారు. వీరికి తాజాగా నార్త్ లో ఊహించని షాక్ ఎదురైంది. 

PREV
15
బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఎంట్రీ

టాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్, తృప్తి డిమ్రి ల క్రేజ్ రోజు రోజుకి పెరుగుతోంది. భారీ పాన్ ఇండియా చిత్రాల్లో వీరికి అవకాశాలు వస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ సీతారామం, తృప్తి డిమ్రి యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చారు. దీనితో వీరిద్దరి పేర్లు మారుమోగాయి. 

DID YOU KNOW ?
హీరోయిన్ కాకముందు టీవీ సీరియల్స్ లో..
మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాకముందు హిందీలో టివి సీరియల్స్ లో నటించింది. 2012లో ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్ అనే టీవీ సీరియల్ తో మృణాల్ కెరీర్ ప్రారంభం అయింది. 
25
అల్లు అర్జున్ మూవీలో మృణాల్ ఠాకూర్

త్వరలో మృణాల్ ఠాకూర్, తృప్తి డిమ్రి ఇద్దరూ భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో దీపికా పదుకొనెతో పాటు హీరోయిన్ గా ఎంపికైంది. ఈ మూవీ 800 కోట్ల బడ్జెట్ లో సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందనుంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

35
ప్రభాస్ స్పిరిట్ లో తృప్తి డిమ్రికి ఛాన్స్

ఇదిలా ఉండగా తృప్తి డిమ్రి.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో హీరోయిన్ గా ఖారారైంది. ముందుగా ఈ చిత్రంలో దీపికా పదుకొనెని హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఆమెతో విభేదాల కారణంగా సందీప్ రెడ్డి తృప్తి డిమ్రిని ఎంపిక చేశారు. స్పిరిట్ చిత్రం 500 కోట్ల బడ్జెట్ లో రూపొందనుంది. అల్లు అర్జున్, అట్లీ చిత్రం.. సందీప్ రెడ్డి, ప్రభాస్ చిత్రాలు రెండూ 1300 కోట్ల బడ్జెట్ లో రూపొందనున్నాయి. ఇది మృణాల్ ఠాకూర్, తృప్తి డిమ్రిలకు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

45
నార్త్ ఆడియన్స్ నుంచి షాక్

అయితే నార్త్ ఆడియన్స్ నుంచి మృణాల్ ఠాకూర్, తృప్తి డిమ్రిలకు తాజాగా ఊహించని షాక్ ఎదురైంది. మృణాల్ ఠాకూర్ రీసెంట్ గా బాలీవుడ్ లో సన్నాఫ్ సర్దార్ అనే చిత్రంలో నటించింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దారుణమైన రెస్పాన్స్ అందుకుంది.  రెండు రోజుల్లో ఈ చిత్రం కేవలం 14 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది.

55
ఫ్లాప్ దిశగా ధడక్ 2

అదే విధంగా తృప్తి డిమ్రి నటించిన ధడక్ 2 చిత్రం కూడా ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. ఈ మూవీ 2 రోజుల్లో 6 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీలో సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటించారు. మృణాల్ ఠాకూర్, తృప్తి డిమ్రిలకు వారి పాన్ ఇండియా చిత్రాలకు ముందు బాలీవుడ్ లో తీవ్ర నిరాశ ఎదురైంది. మృణాల్ ఠాకూర్ సౌత్ తో పాటు నార్త్ లో కూడా పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. కానీ సన్నాఫ్ సర్దార్ 2 కి వస్తున్న రెస్పాన్స్ ఆమెకి టెస్టింగ్ టైం అనే చెప్పాలి.

Read more Photos on
click me!

Recommended Stories