విజయ్ బాటలో రజినీకాంత్, సినిమాలకు గుడ్ బై చెప్పబోతోన్న సూపర్ స్టార్ ? లాస్ట్ మూవీ ఏదో తెలుసా?

Published : Oct 29, 2025, 11:48 AM IST

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్  గా వెలుగు వెలుగుతోన్న రజినీకాంత్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నారా? మూవీస్ నుంచి  తప్పుకోవాలని ఆయన  నిర్ణయించుకున్నారా..? తలైవా  చివరి సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు? 

PREV
14
నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజినీకాంత్

ఫిల్మ్ ఇండస్ట్రీలో  ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి రజినీకాంత్. సాధారణ బస్ కండక్టర్‌గా పనిచేసిన రజినీకాంత్, ఈరోజు ఇండియన్  సినిమా గర్వించే విదంగా   సూపర్‌స్టార్‌గా ఎదిగారంటే దానికి ఆయన కృషే కారణం. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజినీకాంత్‌కు ప్రస్తుతం 74 ఏళ్లు. ఈ వయసులోనూ చురుగ్గా ఉంటూ, మంచి డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నారు. ఆయన కాల్షీట్ల కోసం నిర్మాతలు క్యూలో నిలబడుతున్నారు. కానీ రజినీకాంత్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

24
సినిమాలకు సూపర్ స్టార్ గుడ్ బై

రజినీకాంత్  ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.  వయసు పెరుగుతుండటంతో నటనకు గుడ్ బై చెప్పి.., ప్రశాంతంగా విశ్రాంతి  తీసుకోవాలని రజినీ భావిస్తున్నారట. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న 'జైలర్ 2' సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది.  సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రజినీతో పాటు శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఫహద్ ఫాసిల్ లాంటి భారీ కాస్టింగ్  నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

34
28 ఏళ్ళ తరువాత..

ఈసినిమా తరువాత  తర్వాత సుందర్ సి దర్శకత్వంలో రజినీ ఓ సినిమా చేయనున్నారట. ఆ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. 'జైలర్ 2' షూటింగ్ పూర్తి కాగానే, సుందర్ సి దర్శకత్వంలో నటించనున్నారట రజినీ. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించనున్నట్టు సమాచారం. ఈ సినిమాతో రజినీ, సుందర్ సి దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ కలవనున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు 'అరుణాచలం' అనే మాస్టర్‌ పీస్ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆ టైమ్ లో  బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

44
కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా

'జైలర్ 2', సుందర్ సి దర్శకత్వంలో సినిమా పూర్తి చేశాక, రజినీకాంత్ కమల్ హాసన్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నారు.  అదే రజినీకాంత్  చివరి సినిమా అయ్యే అవకాశం ఉందట. ఆ సినిమాతోనే ఆయన నటనకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కమల్ రాజ్ కమల్ ఫిల్మ్స్, ఉదయనిధి రెడ్ జెయింట్ మూవీస్ కలిసి నిర్మించనున్నాయట. మొదట ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు రాగా, ఇప్పుడు ఆ అవకాశం నెల్సన్‌ దిలీప్ కుమార్ కు  దక్కినట్టు తెలుస్తోంది.  ఈ సినిమా షూటింగ్ 2027లో ప్రారంభం అవుతుందని అంచనా.

Read more Photos on
click me!

Recommended Stories