బాహుబలిలో శివగామి త్యాగం, 48 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటననే రాజమౌళి ఇలా..10000 మందిని బలిగొన్న విషాదం

Published : Oct 29, 2025, 11:03 AM IST

బాహుబలి రీరిలీజ్ కి రెడీ అవుతున్న తరుణంలో కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. బాహుబలిలో శివగామి తాను ప్రాణాలు వదులుతూ మహేంద్ర బాహుబలిని కాపాడుతుంది. ఆ సన్నివేశానికి మూలం 48 ఏళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ లో నిజంగానే జరిగిన సంఘటన అని తెలుసా ? 

PREV
15
బాహుబలి రీ రిలీజ్

రాజమౌళి తెరకెక్కించిన దృశ్య కావ్యం బాహుబలి చిత్రం అక్టోబర్ 31న రీ రిలీజ్ అవుతోంది. బాహుబలి 1, బాహుబలి 2 రెండు భాగాలని కలిపి ఎడిట్ చేసి బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బాహుబలి చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి 1, ఆ చిత్ర పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు రాజమౌళి గురించి పెద్ద చర్చే జరిగింది.

25
ఆ పోస్టర్ కాపీ అంటూ విమర్శలు

బాహుబలి 1లో శివగామి తాను నదిలో మునిగిపోతున్నప్పటికీ ఒంటి చేత్తో పసిబిడ్డగా ఉన్న మహేంద్ర బాహుబలిని పట్టుకుని ఉంటుంది. అది అద్భుతమైన సన్నివేశం. సినిమా టోన్ ని, శివగామి త్యాగాన్ని, ఆమె ధైర్య సాహసాలను తెలియజేసే సీన్ అది. దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయినప్పుడు రాజమౌళిపై ట్రోలింగ్ జరిగింది. 1998లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ సైమన్ బిర్చ్ నుంచి శివగామి బిడ్డని నదిలో ఒంటి చేత్తో పట్టుకునే పోస్టర్ కాపీ చేశారు అంటూ విమర్శలు వచ్చాయి. బాహుబలి 1లో ఆ సన్నివేశానికి మూలం ఎక్కడో హాలీవుడ్ మూవీలో లేదు.. ఆంధ్రప్రదేశ్ లోనే రియల్ లైఫ్ లో 48 ఏళ్ళ క్రితం అలాంటి విషాదకర సంఘటన జరిగింది.

35
48 ఏళ్ళ క్రితం జరిగిన విషాదం

1977లో ఆంధ్రప్రదేశ్ లో దివిసీమ తుఫాను పెను ప్రళయం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విషాదకర సంఘటనల్లో అది కూడా ఒకటి. ఈ ప్రకృతి విపత్తులో 10000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ వరదల్లో పసిపిల్లలు, యువకులు, మహిళలు, వృద్ధుల్లో ఎంతో మంది ప్రాణాలు వదిలారు. ఆ విషాదాన్ని అప్పట్లో ప్రముఖ తెలుగు చిత్రకారుడు వడ్డాది పాపయ్య తన పైంటింగ్స్ రూపంలో చిత్రీకరించారు.

45
శివగామి సన్నివేశానికి ఇదే ఆదర్శం

దివిసీమ ఉప్పెనలో జరిగిన కొన్ని హృదయ విదారక సంఘటనల ఆధారంగా ఆయన చిత్రాలు గీశారు. వాటిలో ఒక తల్లి తాను వరదలో మునిగిపోతున్నప్పటికీ తన బిడ్డని చేతులతో పట్టుకుని ఉంటుంది. ఆ దృశ్యాన్ని వడ్డాది పాపయ్య కళ్ళకి కట్టినట్లు పైంటింగ్ వేశారు. బాహుబలి 1లో శివగామి సన్నివేశానికి ఇదే ఆదర్శం అని అంటున్నారు.

55
లెజెండ్రీ చిత్రకారుడు పాపయ్య

పాపయ్య ఇలాంటి అద్భుతమైన చిత్రాలు ఎన్నో గీసిన లెజెండ్రీ చిత్రకారుడు. చందమామ మ్యాగజైన్ లో మహిషాసుర మర్దిని లాంటి పాపయ్య కళాఖండాలు ఎన్నో వచ్చాయి. రచయితగా కూడా ఆయన రాణించారు. పురాణాలకి సంబంధించిన ఎన్నో చిత్రాలు ఆయన గీశారు. ఆయన రచనలో వచ్చిన విష్ణు కథ బాగా ప్రాచుర్యం పొందింది. దివిసీమ ఉప్పెనకి సంబంధించిన ఆయన పైంటింగ్స్ ఎక్కువగా అందుబాటులో లేనప్పటికీ శివగామి సన్నివేశానికి ఆదర్శంగా నిలిచిన ఈ పైంటింగ్ మాత్రం వైరల్ అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories