'మాస్ జాతర' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది.ఈ వేడుకకు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మాస్ మహారాజ్ రవితేజ నటించిన మాస్ జాతర చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. దీనితో హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హీరో సూర్య చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. మాస్ జాతర చిత్రాన్ని నాగవంశీ నిర్మించారు. ఆయన నిర్మాణంలోనే సూర్య తన తదుపరి చిత్రంలో నటిస్తున్నారు. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య సందడి చేయడం ఫ్యాన్స్ కి కన్నుల విందులా అనిపించింది.
25
రవితేజ గురించి జ్యోతికకి బాగా తెలుసు
సూర్య మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్య సతీమణి జ్యోతిక.. రవితేజతో షాక్ మూవీలో నటించింది. ఆ సినిమాలో నటిస్తున్న సమయంలోనే జ్యోతిక, సూర్య వివాహం జరిగింది. దీనితో మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య జ్యోతిక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రవితేజ నటించిన సినిమా ఈవెంట్ కి రావడం చాలా సంతోషం. రవితేజ గురించి నా కంటే బాగా నా భార్య జ్యోతిక, తమ్ముడు కార్తీకి ఎక్కువ తెలుసు. జ్యోతిక రవితేజతో షాక్ మూవీలో నటించారు.
35
నా తమ్ముడికి ఆ సినిమానే టర్నింగ్ పాయింట్
కార్తీ కెరీర్ కి విక్రమార్కుడు రీమేక్ మూవీ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. వాళ్ళిద్దరికీ రవితేజతో పర్సనల్ కనెక్ట్ ఉంది. మా ఇంట్లో ఎప్పుడైనా రవితేజ ప్రస్తావన వస్తే అందరి ముఖాల్లో ముందుగా నవ్వులు కనిపిస్తాయి. అలాంటి వ్యక్తి రవితేజ గారు. అంతులేని ఎనర్జీకి మనిషి రూపం ఉంటే అది రవితేజనే.
రవితేజ ఎనర్జీ, కామెడీ టైమింగ్ లో నేటివ్ టచ్ కనిపిస్తుంది. నవ్వించడం అనేది చాలా కష్టమైన, గొప్ప ఆర్ట్. కానీ రవితేజ చాలా సింపుల్ గా దశాబ్దాలుగా ఆడియన్స్ ని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. రజినీకాంత్, అమితాబ్ తర్వాత అంత గొప్ప కామిక్ టైమింగ్ ఉన్న హీరో రవితేజ అంటూ సూర్య ప్రశంసలు కురిపించారు.
55
మరోసారి రవితేజతో శ్రీలీల రొమాన్స్
మాస్ జాతర మూవీలో మరోసారి శ్రీలీల రవితేజకి జోడీగా నటిస్తోంది. నరేష్, రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తన గత చిత్రాలు ఫ్లాప్ అయ్యాయని.. మాస్ జాతర సినిమాతో నిరాశపరచను అని రవితేజ ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. "వెంకీ, విక్రమార్కుడు, కిక్ చిత్రాల్లాగా రవితేజ గారి సినిమా అంటే ఏమి ఆశించి థియేటర్ కి వస్తారో.. అన్ని అంశాలు మాస్ జాతరలో ఉంటాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను అని అన్నారు.