రజనీకాంత్‌కు డూప్ వేసిన మనోజ్ భారతీరాజా, ఏ సినిమానో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

Manoj Bharathirajaఫ భారతీరాజా కొడుకు మనోజ్ గుండెపోటుతో చనిపోయిన నేపథ్యంలో, ఆయన సినిమాలో రజనీకి డూప్‌గా నటించిన విషయం బయటకు వచ్చింది. ఆ మూవీ ఏంటో తెలుసా?

Rajinikanth Body Double Manoj Bharathiraja in robo Movie in telugu arj

Rajinikanth కోసం మనోజ్ భారతీరాజా బాడీ డబుల్‌గా నటించారు: భారతీరాజా కొడుకు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో చనిపోవడం అత్యంత బాధాకరం. ఇది భారతీరాజా ఇంట్లోనే కాదు, కోలీవుడ్‌లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. 48 ఏళ్లకే చనిపోవడం భారతీరాజా కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. ఆయన బాడీ చెన్నైలోని ఆయన ఇంట్లో ఉంది. సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. 

Rajinikanth Body Double Manoj Bharathiraja in robo Movie in telugu arj
మనోజ్ భారతీరాజా, రజనీకాంత్

మనోజ్‌ భార‌తీరాజా, త‌మిళంలో న‌టుడిగా తాజ్ మ‌హ‌ల్, అల్లి అర్జున, వ‌రుష‌మెల్లాం వ‌సంతం వంటి చిత్రాల్లో న‌టించారు. చిన్న‌ప్ప‌టి నుంచి తండ్రిలా ద‌ర్శ‌కుడు కావాల‌ని ఉండేది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `బాంబే` చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌గ్గ‌ర `రోబో` సినిమాలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు.


రోబో సినిమాలో మనోజ్ భారతీరాజా

శంకర్, మణిరత్నం దగ్గర పనిచేసిన అనుభవంతో 2023లో `మార్గళి తింగళ్` అనే సినిమా తీశాడు మనోజ్. ఇది అతను తీసిన మొదటి సినిమా. దీని తర్వాత `సిగప్పు రోజాక్కల్` సినిమాకు సీక్వెల్ తీయాలనుకున్నాడు. కానీ అది జరగలేదు. మనోజ్ చనిపోవడంతో ఆయన గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి.

రజనీకాంత్‌కు డూప్‌గా మనోజ్ భారతీరాజా

మనోజ్ భారతీరాజా, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు డూప్‌గా నటించారు. `రోబో` సినిమాలో ఆయన రజనీకి డూప్ వేశాడు.  ఈ మూవీకి శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మనోజ్, రజనీ చిట్టి రోబోగా ఐశ్వర్య రాయ్‌తో కారులో వెళ్లే సీన్‌లో  డూప్‌గా నటించాడు. అప్పటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

read  more: పెళ్లైనా సరే, వెంకటేష్‌నే చేసుకుంటా.. ఇంట్లో పెద్ద గొడవ చేసిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? సౌందర్య కాదు

also read; రామ్‌ చరణ్‌ బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్‌.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా బుచ్చిబాబు ఏం ఇవ్వబోతున్నాడంటే

Latest Videos

vuukle one pixel image
click me!