కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం నేను వెంకటేష్‌నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ చేసిందట. ఆమె ఎవరో కాదు రాశీ. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది రాశీ. చెన్నైలో విజయ, ఏవీఎం స్టూడియోల వద్దనే తమ పేరెంట్స్ టీషాప్ నడిపించేవాళ్లట. ఆ సమయంలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు అక్కడికి వచ్చి టీ తాగేవారట.
ఓ సారి రాశీ మేగజీన్‌పై వెంకటేష్ ఫోటోలు చూసింది. అలాగే ఆయన నటించిన సినిమాలు చూసింది. అప్పటికీ ఆమెది చిన్న వయసు. టీనేజ్‌కి తక్కువగానే ఉంటుంది. ఆ సమయంలోనే తాను వెంకటేష్‌ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ పెట్టుకుందట.