Robinhood Budget, Censor and Business Details in telugu
నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. చలో, భీష్మ సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావటంతో మంచి క్రేజ్ ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద ఎక్సపెక్టేషన్స్ ని పెంచింది.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయ్యింది, బడ్జెట్ ఎంత పెట్టారు, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి వంటి విషయాలు చూద్దాం.
23
Robinhood Budget, Censor and Business Details in telugu
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రంకు మ్యాడ్ సినిమా నుంచి పోటి ఎక్కువ ఉండటంతో నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్ కు మధ్య నెగోషియేషన్స్ బాగా జరిగాయంటున్నారు.
ఈ క్రమంలో ఆంధ్రా ఏరియాని 15 కోట్లకు అనుకున్నది 12 కోట్లు, చివరకు 10 కోట్లు దగ్గరకు వచ్చి ఫైనల్ అయ్యిందిట. అలాగే సీడెడ్ ఏరియారు మూడున్నర కోట్లు బిజినెస్ సాగింది.
ఇక నైజాంలో నిర్మాతలు స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. మొత్తం 26 కోట్ల నుంచి 27 కోట్ల లోపు థియేటర్ బిజినెస్ అయ్యినట్లు. అంటే థియేటర్ షేర్ 40 కోట్లు దాకా రాబట్టాల్సి ఉంది. అప్పుడు లాభాల్లో పడతారు.
33
Robinhood Budget, Censor and Business Details in telugu
అయితే నితిన్ కెరియర్ లోనే అత్యంత హైయెస్ట్ నాన్ దియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ జీ ఫైవ్ సంస్థ కొనుగోలు చేయగా శాటిలైట్ రైట్స్ జీ తెలుగు కొనుగోలు చేసింది.
నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ రేటుకు ఈ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశకంర్‌లు దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.