పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ `ఉస్తాద్ భగత్ సింగ్` రిలీజ్‌కి రెడీ అవుతుంది. తాజాగా ఇది సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి ఈ చిత్రానికి ఎలాంటి సర్టిఫికేట్ వచ్చింది. నిడివి ఎంత అనేది చూస్తే.
పవర్ స్టార్ పవన్ కళ్యణ్ ప్రస్తుతం `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంలో నటించారు. `హరి హర వీరమల్లు`వంటి ఫెయిల్యూర్, `ఓజీ` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తోన్న సినిమా ఇది. ఏడాది గ్యాప్‌లోనే ఇప్పుడు మూడో సినిమా రాబోతుంది. ఉగాది పండగని పురస్కరించుకుని మార్చి 19న విడుదల కానుంది. దీంతో చిత్ర ప్రమోషన్స్ షురూ చేసింది టీమ్. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. ఇప్పుడు మూడో పాటని రిలీజ్ చేయబోతుంది.
25
`ఉస్తాద్ భగత్ సింగ్` మూడో సాంగ్ రాబోతుంది.
`ఎక్కే, దిగే కిక్కులోన దక్కేదేముందే అరె సచ్చే దాకా కిక్కే ఉండాలే.. ఎక్కీ తొక్కేటోల్లే ఉంటే తగ్గేదేముందే.. నెగ్గే దాకా తిక్కే ఉండాలే` అంటూ సాగే పాట రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇది అభిమానుల్లో జోష్ నింపేదిగా ఉండబోతుందని చెప్పొచ్చు. ప్రోమో మాత్రం అదిరిపోయింది. ఇటీవల ఈ మూవీలోని పాటల గురించి అనంతశ్రీరామ్ మాట్లాడుతూ, ఒక్కో పాటని మించి మరోపాట ఉంటుందని, అభిమానులను ఊపేసే విధంగా ఉంటుందని తెలిపారు. ఐటెమ్ సాంగ్ లేదని దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించారు.
35
`ఉస్తాద్ భగత్ సింగ్` సెన్సార్ రివ్యూ
ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. సినిమ సెన్సార పూర్తి చేసుకుంది. యూ ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఎలాంటి కట్స్ లేకుండా ఈ సర్టిఫికేట్ ఇవ్వడం విశేషం. ఈ సమ్మర్‌కి ఫ్యామిలీ అంతా కలిసి చూసే మూవీ అవుతుందని, ఫ్యామిలీ ఆడియెన్స్ తో థియేటర్లు నిండిపోతాయని టీమ్ వెల్లడించింది. సినిమా రెండు గంటల 29 నిమిషాలు ఉంటుందట. మూవీ పిల్లలు తప్ప అన్ని వర్గాల ఆడియెన్స్ చూడొచ్చు. వల్గారిటీగానీ, రొమాన్స్ గానీ ఎక్కువగా ఉండదు. కాకపోతే యాక్షన్ ఉంటుంది. అది కూడా డీసెంట్‌గానే ఉంటుందని సమాచారం.
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన `ఉస్తాద్ భగత్ సింగ్` మూవీలో శ్రీలీలా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. పార్థిబన్ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఈ చిత్రం వచ్చే గురువారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇది తమిళంలో వచ్చిన `థెరి`కి రీమేక్ అనే ప్రచారం జరిగిన నేపథ్యంలో అది నిజం కాదని తెలిపారు హరీష్ శంకర్. అదే సమయంలో సినిమాలో పొలిటికల్ డైలాగ్‌లు కూడా ఉండవని, చాలా నీట్‌గా ఉంటుందని వెల్లడించారు.
`ఉస్తాద్ భగత్ సింగ్` మూవీ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా హరీష్ ఈ మూవీని రూపొందించారు. అభిమానులు కోరుకునేలా మాస్ డైలాగ్ లు, యాక్షన్ ఉంటుందని సమాచారం. అవి మూవీని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తాయి. మరి థియేటర్లలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.