తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తోంది మీనాక్షి చౌదరి. తాజాగా ఆమె తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కొన్ని కండిషన్లు పెట్టింది. ఇంతకీ ఎంటా కోరికలు..?
సౌత్ ఇండియాలో వేగంగా ఎదుగుతున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. హిందీలో ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో అదరగొడుతోంది. దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్', విజయ్‌తో 'ది గోట్' సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాబోయే భర్త గురించి మీనాక్షి సరదాగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
24
100 ఎకరాల భూమి ఉండాలి..
ఆ ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ.. 'నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కనీసం 100 ఎకరాల భూమి ఉండాలి. అంతేకాదు, అతనికి వంట చేయడం, బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం కూడా వచ్చి ఉండాలి. ఇంటి పనులన్నీ బాధ్యతగా చూసుకోవాలి. చిన్న చిన్న పనులకు కూడా ఇతరులపై ఆధారపడకుండా, అన్ని పనులు తనే చేసుకోగలగాలి' అని చెప్పింది.
34
నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
మీనాక్షి మాటలు విన్న నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 'ఇంతకీ నీకు భర్త కావాలా? పనివాడు కావాలా?', 'అన్ని పనులు చేసేవాడైతే, మరి 100 ఎకరాలు ఎందుకు?', 'అతనికి 100 ఎకరాలుంటే, నీ వెనుక ఎందుకు పడతాడు?' అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంటి పనికి మనిషిని పెట్టుకోవడం ఇష్టం లేకనే ఈ ప్లాన్ వేశావా అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
సాధారణంగా హీరోయిన్లు తమ సహనటులను లేదా పెద్ద వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకుంటారు. కానీ మీనాక్షి మాత్రం ఇంటి పనులు చేసే భర్త కావాలని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్‌గా మారింది. నెటిజన్లు ఆమె వ్యాఖ్యలపై మీమ్స్ వేసి ఆడేసుకుంటున్నారు. ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం' అనే తెలుగు సినిమా గత సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు చేయడం గమనార్హం.