అజ్ఞానంతో చేస్తున్నారు.. అల్లు అర్జున్‌పై వివాదాస్పద కామెంట్లకు రాజేంద్రప్రసాద్‌ వివరణ ఇదే

First Published | Dec 18, 2024, 6:53 PM IST

అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప 2` సినిమాపై ఇటీవల రాజేంద్రప్రసాద్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తాజాగా దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. 
 

అల్లు అర్జున్‌ ఇప్పుడు రెండు రకాలుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఒకటి `పుష్ప 2` సినిమా విజయానికి సంబంధించిన చర్చ నడుస్తుంది. ఈ మూవీ కలెక్షన్ల సునామీ గురించి మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు ఏకంగా 1400కోట్లు వసూలు చేసినట్టు టీమ్‌ చెబుతుంది. హిందీతో భారీ వసూళ్లని రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా పెద్దగా ఆడటం లేదు, కానీ నార్త్ లో మాత్రం దుమ్ములేపుతుంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 

read more: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ.. బాలయ్య వారసుడి ఎంట్రీలో మరో ట్విస్ట్ ? తెరపైకి మరో దర్శకుడి పేరు
 

ఇక బన్నీ వార్తల్లో నిలిచేది వివాదం విషయంలో. ఆయన సినిమా ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్‌కి వెళ్లి అభిమానుల మధ్య సినిమా చూశారు. ఆయన్ని చూసేందుకు భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో పరిస్థితి కంట్రోల్‌ కాక తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ రేవతి చనిపోయారు. ఆమె కొడుకు శ్రీ తేజ్‌ ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. ఈ ఘటనపై బన్నీని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు. ఆయన మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. కానీ ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ కేసు వెంటాడుతూనే ఉంది. 


ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌పై ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు రాజేంద్రప్రసాద్‌. `హరికథ` అనే వెబ్‌ సిరీస్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, `వాడెవడో ఎర్రచందనం దొంగ వాడు హీరో` అంటూ కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. రాజేంద్రప్రసాద్‌పై అల్లు అర్జున్‌పై ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. భారీగా ట్రోల్స్ ఫేస్‌ చేశాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన స్పందించారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

also read: పవన్ కళ్యాణ్ 'ఓజీ': వైరల్ అవుతున్న న్యూస్ !
 

`దొంగ అంటే దొంగోడు అయిపోతాడా. అల్లు అర్జున్‌ నా బిడ్డలాంటివాడు. అతనంటే నాకు చాలా ఇష్టం. నన్ను పిచ్చగా ప్రేమిస్తాడు. ఎప్పుడు కలిసినా గురువుగారు గురువుగారు అంటుంటాడు. అల్లు అర్జున్‌ `జులాయి` సినిమాకి ముందు, ఆ మూవీ తర్వాత. నన్ను ఎంత లవ్‌ చేస్తాడో చెక్‌ చేసుకోవచ్చు.

మేం కలిసి `జులాయి`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `అల వైకుంఠపురములో` సినిమాలు చేశాం. `జులాయి` సినిమా సమయంలోనూ ఎంత బాగా చేశాడో మాట్లాడుకున్నాం. అలాగే `పుష్ప`కి నేషనల్‌ అవార్డు వచ్చినప్పుడు కూడా గురువుగారు మనం కొట్టేశాం అన్నాడు. మనం చేసే క్యారెక్టర్‌ దాన్ని మనం కన్విన్స్ చేయగలిగితే, అవతలి వాడు కన్విన్స్ అయితేనే సాధిస్తాం.

వాడెవడో అజ్ఞానంతో, అమాయకత్వంతో నన్ను నెగటివ్‌ సైడ్‌ తీసుకెళ్లినా మీరు ఆ వైపు వెళ్లొద్దు. నా వద్ద ప్రేమ తప్ప మరోటి ఉండదు, నేను తిట్టినా అందులో ఏదో ఉందని ఆలోచిస్తుంటారు, కాబట్టి అవన్నీ నమ్మవద్దు` అని తెలిపారు రాజేంద్రప్రసాద్‌. అల్లు అర్జున్‌పై చేసిన కామెంట్లని ఈ రకంగా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 
 

ఇక అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప 2` సినిమా సంచలన విజయం సాధించి భారీ వసూళ్ల దిశగా వెళ్తుంది. ఇప్పటికే నాన్‌ `బాహుబలి 2` రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇప్పుడు బాహుబలి రికార్డుల దిశగా వెళ్లుంది. అయితే టీమ్‌ ప్రకటించే కలెక్షన్లలో నిజం లేదని, అవి ఫేక్‌ కలెక్షన్లు అనే కామెంట్లు కూడా ఉన్నాయి. 

read more: ‘పుష్ప 2 ది రూల్‌’ OTT రిలీజ్ డేట్, చిన్న మెలిక

Latest Videos

click me!