Mokshagna
`హనుమాన్` ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. మోక్షజ్ఞ లుక్‌తో పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ మూవీతో బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగానూ మారారు. అయితే ఈ మూవీ ఆగిపోయిందట. డిసెంబర్ 5న ప్రారంభం కావాల్సిన ఈ మూవీ స్టార్ట్ కాలేదు. మోక్షజ్ఞకి ఆరోగ్యం బాగా లేదని, అందుకే ఆగిపోయిందని తెలిపారు బాలయ్య. ఏదైనా మన మంచికే అన్నారు.
Mokshagna Nandamuri
అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీ ఆగిపోయిందట. ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించడని, తన శిష్యుడు డైరెక్ట్ చేస్తాడని చెప్పడంతో బాలయ్యకి మండిందట. మరోవైపు తాను దర్శకత్వం వహించాలంటే భారీగా పారితోషికం డిమాండ్ చేశాడట. సినిమాకి 15కోట్ల పారితోషికంతోపాటు, లాభాల్లో వాటా కూడా ఇవ్వాలని అడుగుతున్నాడట. దీంతో ఆయన్ని పక్కన పెట్టినట్టు సమాచారం.
మరోవైపు వెంకీ అట్లూరి దర్శకత్వంలోనూ సినిమా అనుకున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో మోక్షజ్ఞతో సినిమా చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించిన ప్లాన్స్ జరుగుతున్నాయి. అయితే ఇది మోక్షజ్ఞకి సరైన ఎంట్రీలా ఉండదని బాలయ్య భావిస్తున్నారట. తొలి సినిమా చాలా గ్రాండ్‌గా, ప్రత్యేకంగా ఉండాలని భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది.
also read: సమంతకి స్టార్ ప్రొడ్యూసర్ ఫామ్ హౌజ్ గిఫ్ట్.. కొడుకు కోసం నిర్మాత అంతటి సాహసం ?
`మహానటి`, `కల్కి 2898 ఏడీ` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా ఉండబోతుందనే వార్తలు ప్రారంభమయ్యాయి. నాగ్ అశ్విన్‌తో బాలయ్య చర్చలు జరుపుతున్నారట. ఈ ప్రాజెక్ట్ కన్ఫమ్ అంటున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్త మాత్రం అటు బాలయ్య ఫ్యాన్స్ ని, ఇటు నార్మల్ ఆడియెన్స్ ని సర్‌ప్రైజ్ చేస్తుంది. మరోవైపు `ఆదిత్య 999` చేయడానికి బాలయ్య ప్లాన్ చేస్తున్నారు.
అయితే నాగ్ అశ్విన్.. ప్రభాస్‌తో `కల్కి 2898 ఏడీ` సినిమాని తెరకెక్కించారు. ఇది పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు `కల్కి 2`పై వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ స్టార్ట్ కావడానికి ఏడాదిపైనే టైమ్ పడుతుంది. ఈ క్రమంలో ఈ లోపు మోక్షజ్ఞ సినిమా ఉండే అవకాశాలున్నట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం, ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి.
read more: మోక్షజ్ఞ సినిమాలో మహేష్ బాబు లక్కీ హీరోయిన్, ఏ పాత్ర చేయబోతోంది..?