బుల్లితెరపై నటించి తమ కో స్టార్స్ నే ప్రేమించి వివాహం చేసుకున్న నటీనటుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. రాజీవ్ కనకాల నుంచి నిరుపమ్ వరకు పలువురు నటులు ప్రేమ వివాహాలు చేసుకున్నారు.
తెలుగు టీవీ సీరియల్స్ లో నటించి ప్రేమ వివాహం చేసుకున్న నటీనటులు కొందరు ఉన్నారు. రాజీవ్ కనకాల, యాంకర్ సుమ నుంచి నిరుపమ్, మంజుల వరకు బుల్లితెర నటీనటులు లవ్ మ్యారేజ్ చేసుకుని సక్సెస్ ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అలా ప్రేమ వివాహాలు చేసుకున్న 8 జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
29
జాకీ- హరిత
నటుడు జాకీ, నటి హరిత సంఘర్షణ అనే టీవీ సీరియల్ తో మొదట కలుసుకున్నారు. ఆ విధంగా ఏర్పడ్డ పరిచయంతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.
39
రాజీవ్ కనకాల-సుమ కనకాల
రాజీవ్ కనకాల, సుమ కనకాల జంట గురించి అందరికీ తెలుసు. 1995లోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. కెరీర్ బిగినింగ్ లో సుమ కూడా టీవీ సీరియల్స్ లో నటించింది. రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల దర్శకత్వం వహించిన ఓ టీవీ సీరియల్ లో సుమ నటించింది. ఆ విధంగా రాజీవ్ తో ఆమెకి పరిచయం ఏర్పడింది. మొదట రాజీవ్ లవ్ ప్రపోజల్ చేస్తే సుమ రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత గట్టిగా ప్రయత్నించి మొత్తానికి ఆమెని ప్రేమలో పడేశానని రాజీవ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సుమకి సినిమాల్లో అవకాశం వస్తే రాజీవ్ మొదట్లో వద్దని చెప్పారట. ప్రేమలో ఉన్నప్పుడే ఇన్ని కండిషన్స్ పెడుతున్నాడు.. పెళ్లయ్యాక ఇంకెన్ని కండిషన్స్ పెడతాడో అని సుమ భావించి రాజీవ్ తో బ్రేకప్ చేసుకుందట. ఏడాది పాటు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత తిరిగి ఇద్దరూ కలుసుకుని మళ్ళీ ప్రేమలో పడ్డారు. మొత్తానికి వివాహం చేసుకున్నారు.
ప్రముఖ నటి శ్రుతి, నటుడు మధుసూదన్ ఋతురాగాలు టీవీ సీరియల్ లో నటించి ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ చక్రవాకం సీరియల్ లో కూడా నటించారు.
59
నవీన్- మాధురి సేన్
నవీన్, మాధురి సేన్ జంట మందాకిని అనే టీవీ సీరియల్ లో నటించి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
69
వక్కంతం వంశీ-శ్రీవిద్య
ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కెరీర్ బిగినింగ్ లో టీవీ ప్రజెంటర్ గా, బుల్లితెర నటుడిగా కెరీర్ ప్రారంభించారు. రేసుగుర్రం, కిక్ లాంటి చిత్రాలు వక్కంతం వంశీకి రచయితగా మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. వక్కంతం వంశీ శ్రీవిద్య అనే బుల్లితెర నటిని వివాహం చేసుకున్నారు.
79
ప్రీతి నిగమ్- నగేష్ కర్రా
నటి ప్రీతి నిగమ్ బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా పలు చిత్రాల్లో నటించింది. ఆమె నగేష్ కర్రాని ప్రేమ వివాహం చేసుకుంది.
89
ఇంద్రనీల్ - మేఘన
ఇంద్రనీల్, మేఘన జంట బుల్లితెరపై నటీనటులుగా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.
99
నిరుపమ్ -మంజుల
కార్తీకదీపం టీవీ సీరియల్ తో నిరుపమ్ పరిటాల సంచలన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నిరుపమ్ నటి మంజులని ప్రేమ వివాహం చేసుకున్నాడు.