సైరా చిత్రం రిలీజ్ అయ్యాక ప్రముఖ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి చిత్ర యూనిట్ ని సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాజశేఖర్ కూడా హాజరయ్యారు. రాజశేఖర్ మాట్లాడుతూ.. చిరంజీవి లాగా ఇంత పెద్ద సినిమాలో నటించాలంటే దిల్ ఉండాలి అని అన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించి తండ్రి కలని సాకారం చేసిన తనయుడుగా రామ్ చరణ్ గుర్తింపు పొందారు అని రాజశేఖర్ ప్రశంసించారు.
నిర్మాత ఏవీఎం గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు.. సినిమాని నిర్మించడానికి కావాల్సింది డబ్బు కాదు.. దిల్ ఉండాలి అని ఆయన చెప్పేవారు. ఆయన చెప్పిన మాటలు చిరంజీవి, రామ్ చరణ్ లని చూస్తే నిజం అనిపిస్తుంది అని అన్నారు.