రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు నందం హరిశ్చంద్రరావు ‘ట్రీ మీడియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజలీదేవి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని వెల్లడించారు. నందం హరిశ్చంద్రరావు మాట్లాడుతూ: ‘‘హిందీలో వారు నిర్మించిన సినిమా 'ఫూలోమ్ కి శేజ్' (Phoolon Ki Sej) అనుకోని విధంగా భారీ బడ్జెట్‌ను దాటి పోయింది.
ఈ సినిమా విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఆర్థికంగా తీరని నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ నష్టాలను భరించేందుకు వారు అప్పటి వరకు కూడబెట్టిన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది’’ అని చెప్పారు.
అయితే ఈ పరిస్థితుల్లోనూ అంజలీదేవి కుంగిపోకుండా, తన భర్తతో కలిసి మరోసారి సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగా రూపొందించిన ‘సతీ సక్కుబాయి’, ‘భక్త తుకారాం’ చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ప్రత్యేకించి ‘భక్త తుకారాం’ సినిమాలో తమిళ సినీ లెజెండ్ శివాజీ గణేశన్ ప్రధాన పాత్ర పోషించారు.