Rajasekhar: పాన్‌ ఇండియా హీరోయిన్‌తో పెళ్లి, రాజశేఖర్‌ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా? చివరికి అదే ఊబిలోకి

Published : Jan 01, 2026, 08:45 AM IST

హీరో రాజశేఖర్‌ ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. హీరోగానే కాదు, క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో రాజశేఖర్‌ పెళ్లికి సంబంధించిన ఓ రహస్యం బయటకు వచ్చింది. 

PREV
16
కమ్‌ బ్యాక్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్న రాజశేఖర్‌

హీరో రాజశేఖర్‌ ఒకప్పుడు స్టార్‌ హీరోగా మెప్పించారు. టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకరిగా రాణించారు. ఇటీవల కాలంలో ఆయన సక్సెస్‌ లేక కొంత స్ట్రగుల్ అయ్యారు. దీంతో సినిమాలకు గ్యాప్‌ వచ్చింది. కానీ ఇప్పుడు కమ్‌ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. క్యారెక్టర్స్ కూడా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ మధ్య నితిన్‌ హీరోగా నటించిన `ఎక్స్ టార్డినరీ మ్యాన్‌` చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా మెప్పించారు. కానీ, అది ఆడలేదు. ఇప్పుడు శర్వానంద్‌తో `బైకర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దీంతోపాటు హీరోగా మరో రెండు సినిమాలు చేస్తున్నారు. అవి షూటింగ్‌ దశలో ఉన్నాయి. వీటితో అదిరిపోయేలా కమ్‌ బ్యాక్‌ ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు రాజశేఖర్‌.

26
పాన్‌ ఇండియా హీరోయిన్‌తో పెళ్లి రిజెక్ట్ చేసిన రాజశేఖర్‌

ఈ క్రమంలో తాజాగా ఒకప్పటి యాంగ్రీ యంగ్‌ మేన్‌ గురించి ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. రాజశేఖర్‌కి సంబంధించిన పెళ్లి మ్యాటర్‌ ఇంట్రెస్ట్‌ ని క్రియేట్‌ చేస్తోంది. ఆయన ఓ పాన్‌ ఇండియా హీరోయిన్‌ ని పెళ్లికి రిజెక్ట్ చేశాడు. సినిమాలు చేస్తుందని చెప్పి రాజశేఖర్‌ ఫ్యామిలీని ఓ గొప్ప హీరోయిన్‌ని రిజెక్ట్ చేశారు. కానీ తమ ఫ్యామిలీ వద్దు అనుకున్న సినిమా రంగంలోకే ఆ తర్వాత రాజశేఖర్‌ రావడం గమనార్హం. కానీ అప్పటికే ఆ హీరోయిన్‌ రాజశేఖర్‌కి అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది. ఆయనకు దొరక్కుండా పోయింది.

36
శ్రీదేవితో రాజశేఖర్‌ కి పెళ్లి ప్రపోజల్‌

రాజశేఖర్‌కి పెళ్లి ప్రపోజల్‌ వచ్చింది అతిలోక సుందరి శ్రీదేవి ఫ్యామిలీ నుంచే. రాజశేఖర్‌ ఫ్యామిలీ, శ్రీదేవి ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఉంది. రాజశేఖర్‌ తండ్రి, అతిలోక సుందరి తండ్రి ఇద్దరు మంచి స్నేహితులు. ఆ స్నేహంతోనే రాజశేఖర్‌కి శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అయితే ఆ సమయంలో రాజశేఖర్‌ డాక్టర్‌ గా చేస్తున్నారు. అప్పట్లో డాక్టర్‌కి మంచి క్రేజ్‌ ఉండేది. దీంతో శ్రీదేవి స్టార్ హీరోయిన్‌ అయినప్పటికీ రాజశేఖర్‌తో పెళ్లి చేయాలనుకున్నారు. శ్రీదేవి కుటుంబమే ఈ మ్యారేజ్‌ ప్రపోజల్‌ తీసుకొచ్చారు.

46
శ్రీదేవితో పెళ్లికి నో చెప్పిన రాజశేఖర్‌ కుటుంబం

కానీ రాజశేఖర్‌ ఫ్యామిలీ నో చెప్పింది. శ్రీదేవి సినిమాలు చేస్తుంది. సినిమా వాళ్లపై రాజశేఖర్‌ ఫ్యామిలీకి చిన్న చూపు ఉండేది. దీంతో ఈ ప్రపోజల్‌ని సున్నితంగా తిరస్కరించారట. `మా వాడు ఎంఎస్‌ చేయాలి. ఇప్పుడే పెళ్లి వద్దు` అని చెప్పారట. ఈ విషయాన్ని రాజశేఖర్‌ ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో తెలిపారు. అంతేకాదు తాను సినిమాలు చేయడం కూడా తమ పేరెంట్స్ కి ఇష్టం లేదన్నారు. ఇంట్లో వాళ్లని ఎదురించి సినిమాల్లోకి వచ్చినట్టు తెలిపారు రాజశేఖర్‌. దానికి కూడా కండీషన్స్ పెట్టారట. సినిమాలు చేయ్‌, కానీ అక్కడ ప్రేమ దోమ అంటూ తిరిగితే ఒప్పుకునేది లేదని, తాము చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే కండీషన్‌ మీద సినిమాలకు పంపించారట.

56
జీవితని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజశేఖర్‌

శ్రీదేవి అప్పటికే సినిమాల్లో ఉండటంతో అది నచ్చకనే ఆమెతో పెళ్లికి రిజెక్ట్ చేశారు. అలా శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సిన రాజశేఖర్‌ మరో నటి జీవితని పెళ్లి చేసుకున్నాడు. వీరిది కూడా లవ్‌ మ్యారేజ్‌. 1991లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు శివానీ, శివాత్మిక ఉన్నారు. ఇద్దరూ హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

66
Boney Kapoorని కపూర్‌ని మ్యారేజ్‌ చేసుకున్న శ్రీదేవి

అతిలోక సుందరి శ్రీదేవి.. 1996లో బాలీవుడ్‌ నిర్మాత Boney Kapoorని పెళ్లి చేసుకుంది. ఆయనకిది రెండో పెళ్లి. వీరికి ఇద్దరు కూతుళ్లు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ ఉన్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. తెలుగులో ఆమె `దేవర` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు `పెద్ది`లో చేస్తోంది. నాని మూవీలోనూ నటిస్తున్నట్టు సమాచారం. శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories