Spirit First Look అరాచకం.. షర్ట్ లేకుండా ప్రభాస్‌ లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. వంగా మామూలోడు కాదు

Published : Jan 01, 2026, 07:21 AM IST

`స్పిరిట్‌` మూవీ నుంచి కొత్త ఏడాది ట్రీట్‌ ఇచ్చారు సందీప్‌ రెడ్డి వంగా. ప్రభాస్‌ ఫస్ట్ లుక్‌ని పరిచయం చేశారు. షర్ట్ లేకుండా గాయాలతో ప్రభాస్‌ లుక్‌ అరాచకం అనేలా ఉంది. 

PREV
15
`స్పిరిట్‌` మూవీ ఫస్ట్ లుక్‌

ప్రభాస్‌ త్వరలో `ది రాజాసాబ్‌` చిత్రంతో రాబోతున్నారు. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్‌` మూవీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ మధ్య ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా ఒక ఆడియో టీజర్‌ని కూడా విడుదల చేశారు. ఇది సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో ప్రభాస్‌ పాత్ర ఎలా ఉండబోతుందో తెలిపారు. ఇక ఇప్పుడు కొత్త ఏడాది సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

25
`స్పిరిట్‌`లో ప్రభాస్‌ లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌

2026 న్యూ ఇయర్‌ స్పెషల్‌గా అర్థరాత్రి అరాచకానికి తెరలేపారు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. `స్పిరిట్‌` మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ప్రభాస్‌, హీరోయిన్‌ డిమ్రీ తృప్తి కలిసి ఉన్న ఫోటోని విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ షర్ట్ లేకుండా, గాయాలతో ఉన్నారు. వాటికి ఫస్ట్ ఎయిడ్‌ చేసినట్టుగా ఉంది. హీరోయిన్‌ డిమ్రీ.. రొమాంటిక్‌గా, చీరకట్టులో ఉంది. ప్రభాస్‌ సిగరేట్‌ తాగుతుండగా, లైటర్‌తో సిగరేట్‌ అంటిస్తుంది డిమ్రీ. ప్రభాస్‌ బ్యాక్‌ నుంచి సైడ్‌లో సిగరేట్‌ తాగుతున్నట్టుగా ఉన్న లుక్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అని చెప్పొచ్చు.

35
భారతీయ సినిమా మీ అజానుబాహుడిని చూడండి

`స్పిరిట్‌`లోని ప్రభాస్‌ లుక్‌ సరికొత్తగా ఉంది. గెడ్డంతో ఉన్నాడు. వెనకాల జుట్టు పెద్దగా ఉంది. చూడబోతుంటే `యానిమల్‌` హీరోని తలపిస్తున్నాడు ప్రభాస్‌. మరి ఆ మూవీకి, దీనికి ఏదైనా సంబంధం ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా విడుదల చేసిన `స్పిరిట్‌` ఫస్ట్ లుక్‌ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. జస్ట్ లుక్‌తోనే సినిమాపై అంచనాలను అమాంతం పెంచారు సందీప్‌ రెడ్డి వంగా. ఆయన ఈ ఫస్ట్ లుక్‌ని ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ, `భారతీయ సినిమా, మీ అజానుబాహుడిని చూడండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026, స్పిరిట్‌ ఫస్ట్ లుక్‌` అని తెలిపారు. ఇది ప్రభాస్‌ అభిమానులను, నెటిజన్లని ఆద్యంతం కట్టిపడేస్తుంది. లుక్‌ ట్రెండ్‌ అవుతుంది.

45
ఆకట్టుకున్న `స్పిరిట్` ఆడియో టీజర్‌

ఇక ప్రభాస్‌ హీరోగా, డిమ్రీ తృప్తి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా నటిస్తుండగా, ప్రకాష్‌ రాజ్‌ జైలు సూపరిండెంట్‌గా నటిస్తున్నట్టు ఆ మధ్య విడుదల చేసిన ఆడియో టీజర్‌లో అర్థమయ్యింది. ఇందులో జైలుకి ప్రభాస్‌ రాగా, ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడుతూ, వీడి గురించి విన్నాను. యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్‌లో తేడా ఉండదు. చూద్దాం ఈ ఖైదీ యూనిఫాంలో ఎలా ఉంటాడో. వీడిని బట్టలూడదీసి మెడికల్‌ టెస్ట్ కి పంపించండి` అని ప్రకాష్‌ రాజ్‌ చెప్పగా, చివర్లో ప్రభాస్‌ `మిస్టర్‌ సూపరిండెంట్‌, నాకు చిన్నప్పట్నుంచి ఒక బ్యాడ్‌ హ్యాబిట్‌ ఉంది` అనే డైలాగ్‌ ఈ ఆడియో టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు దాన్ని మించేలా ఈ ఫస్ట్ లుక్‌ ఉండటం విశేషం.

55
ఏడు భాషల్లో `స్పిరిట్‌` మూవీ

ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రానుందని సమాచారం. ఈ చిత్రాన్ని టీ సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై భూషణ్‌ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృష్ణకుమార్‌, ప్రభాకర్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, చైనా, జపాన్‌, కొరియా వంటి భాషల్లో ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో దీన్ని రూపొందిస్తున్నారు సందీప్‌ రెడ్డి వంగా. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories