
కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో జ్యోత్స్న చెంప పగలగొడుతుంది పారిజాతం. గ్రానీ అనీ గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. నీ స్వార్థం కోసం నీ తమ్ముడిని బలి చేస్తావా? నిన్ను నమ్మినందుకు వాడు జైల్లో కూర్చున్నాడు. మంచి లైఫ్ ఇస్తానని చెప్పి.. వాడికి లైఫే లేకుండా చేశావు అని జ్యోపై విరుచుకుపడుతుంది పారు. నా తమ్ముడికి ఏం కాదు. వాడిని నేను కాపాడుకుంటాను అంటుంది జ్యో.
కాపాడేదానివే అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వాడ్ని అక్కడే వదిలేసి వచ్చేదానివి కాదు అంటుంది పారు. ఇప్పుడు నేను కాశీని కాపాడటానికి ట్రై చేస్తే.. ఆ తప్పులో నేను కూడా ఇన్వాల్వ్ అయినట్లు అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు అంటుంది జ్యోత్స్న. చేస్తే దరిద్రం వదిలిపోయేది. కార్తీక్ గాడు వాళ్ల నాన్నను జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడు. నువ్వు మాత్రం సొంత తమ్ముడ్ని మోసం చేసి జైలుకు పంపించావు అంటుంది పారు.
మామయ్యను సీఈఓ పోస్టు నుంచి తప్పించడానికి వైరాను ట్రాప్ చేశాను. కాశీ జీవితాన్ని మార్చడానికి వైరా దగ్గర ఉద్యోగం ఇప్పించాను. తప్పులు బయటపడితే వైరా దొరికిపోతాడు అనుకున్నాను. కానీ బావే కాశీని కూడా ఇరికించాడు. నాకు కాస్త టైం ఇవ్వు. కాశీని నేనే బయటకు తీసుకువస్తాను అంటుంది జ్యోత్స్న.
మీరు ఇద్దరూ ఒక తల్లి బిడ్డలు అనే విషయాన్ని మర్చిపోకు అంటుంది పారు. నాకు అలాంటి సెంటిమెంట్స్ లేవు. నేను ఎవ్వరినైనా నా అవసరాల కోసమే వాడుకుంటాను గ్రానీ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
మరోవైపు అన్నీ రెడీ చేశాను. శ్రీధర్ గారు వస్తే చాలు అని కాంచనతో అంటుంది అనసూయ. శ్రీధర్ గారు అని చెప్పడం ఎందుకు పెద్దమ్మ. ఏం అనాలో మీకు తెలియదా అంటాడు కార్తీక్. కాస్త కోపంగా చూస్తుంది కాంచన. నువ్వు చెప్పు దీప ఏం అనాలో అంటాడు కార్తీక్. మీ ఆయన అని చెప్పాలి అంటుంది దీప. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మేం అడిగింది చేయాలి అంటాడు కార్తీక్.
ఏం చేయాలో చెప్పు అంటుంది కాంచన. మా నాన్నను కుటుంబ సమేతంగా భోజనానికి పిలవమన్నావు. నా కోసం నా తండ్రిని భర్తలా చూడలేవా అమ్మా? అని అడుగుతాడు కార్తీక్. చూడలేను అంటుంది కాంచన. ఆయనకు నువ్వు వేసిన శిక్ష.. ఉరిశిక్షలా ఉంది. ఏది ఏమైనా ఈ రోజు నువ్వు నా తండ్రిని భర్తలా చూడాల్సిందే అంటాడు కార్తీక్. అంతలో కావేరి, స్వప్న, శ్రీధర్ వస్తారు.
రా కావేరి అంటుంది కాంచన. ఎలా ఉన్నావు పెద్దమ్మ అని అడగడానికి కూడా నాకు మనసు రావడం లేదు. నేను అందరిని బాధపెట్టాను. తొందరపడి తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నా. నా వల్ల నాన్న బాధపెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా బాధపెట్టాను అని ఫీల్ అవుతుంది స్వప్న. ఓదార్పు మాటలు చెప్తాడు కార్తీక్. పదండి వెళ్లి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అంటాడు.
జైల్లో ఉన్న వైరా దగ్గరకు అతని అసిస్టెంట్ వచ్చి.. నీ శత్రువును నమ్మొద్దని చెప్పాను. మాట వినలేదు. ఏం చేయాలో నాకు తెలియదా అన్నావ్ ఇప్పుడు చూడు. జైల్లో కూర్చున్నావు అంటాడు. ఓ వైపు బెయిల్ రాలేదని నేను ఫీల్ అవుతుంటే నువ్వు ఏంట్రా అని చిరాకు పడతాడు వైరా.
నువ్వు తప్పు చేశావు కాబట్టే ఇక్కడ ఉన్నావు. ఏ తప్పు చేయకపోయినా నీ మాట విన్నందుకు నేను ఇక్కడ ఉన్నాను. నా తప్పు తెలుసుకున్నాను అంటాడు కాశీ. అదే మీ మామగారికి శిక్ష పడి ఉంటే నువ్వు ఇలా మాట్లాడే వాడివా? సరైన నిర్ణయం తీసుకున్నానని అనుకునేవాడివి అంటాడు వైరా. నన్ను ఎవరు ఈ పరిస్థితికి తీసుకువచ్చారో.. వాళ్లను కూడా నేను అదే పరిస్థితి రప్పిస్తా అంటాడు వైరా. మా బావ జోలికి వెళ్లకపోవడమే మంచిది అంటాడు కాశీ.
సుమిత్ర నిద్రపోతూ ఉంటుంది. ఆమె కాళ్లకు ఆయింట్ మెంట్ రాస్తుంటాడు దశరథ. సడెన్ గా నిద్రలో నుంచి లేచి ఏంటండీ ఇది? ఇప్పుడు ఇదంతా అవసరమా అంటుంది సుమిత్ర. కాళ్ల నొప్పి అన్నావు కదా అంటాడు దశరథ. అదే తగ్గిపోతుంది. ముందు మీరు లేవండి అంటుంది సుమిత్ర. అదే ఎలా తగ్గిపోతుంది. మందు రాస్తేనే తగ్గుతుంది అంటాడు దశరథ.
భార్యా భర్తల బంధం గురించి సుమిత్రకు వివరిస్తాడు. ఇంతలో డాక్టర్ దగ్గరి నుంచి దశరథకు కాల్ వస్తుంది. రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతాడు దశరథ. రేపు ఒకసారి హాస్పిటల్ కి రండి. వేరే స్పెషలిస్ట్ మీతో మాట్లాడుతారు అంటాడు డాక్టర్. ఫోన్లో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారంటే సుమిత్రకు ఏమైందని కంగారు పడతాడు దశరథ.
మరోవైపు కార్తీక్ ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. జైల్లో కాంచన మాట్లాడిన మాటలను గుర్తుచేసుకొని బాధపడుతాడు శ్రీధర్. మన ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేయడం ఇదే ఫస్ట్ టైమ్ కదా అంటాడు కార్తీక్. మాస్టారు ఏమైనా చెప్పాల్సినవి ఉంటే చెప్పేయండి అంటాడు కార్తీక్. నా దగ్గర ఏం ఉంటాయి. మనమందరం ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుంటుంది అంటాడు శ్రీధర్.
కొడుకు, కోడలు ఉంటే సరిపోతుందా? కూతురు, అల్లుడు వద్దా అంటుంది కాంచన. నేను కాశీని క్షమించను పెద్దమ్మ అంటుంది స్వప్న. అసలు వీటన్నింటికి కారణం మీరే అని శ్రీధర్ ని అంటుంది కాంచన. కాశీకి మరో అవకాశం లేకుండా వాడ్ని పక్కనే పెట్టుకున్నారు. పీఏగా చేయడం వాడికి ఇష్టమా లేదా అని కూడా తెలుసుకోలేదు. అల్లుడు మీకు నచ్చినట్లుగా ఉండాలనుకోవడం తప్పు అంటుంది కాంచన.
మామయ్య గారి విషయంలో అత్తయ్య మారదు అంటుంది దీప. మార్పు ఒకేసారి రాదు మరదలా. ఇంతకు ముందు నాన్న ఈ ఇంటికి రావడానికి కూడా అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందరం కలిసి భోజనం చేస్తున్నాం. ఏదో ఒక రోజు అందరం కలిసే ఉంటాం అంటాడు కార్తీక్. ఏం అన్నావు అన్నయ్య అంటుంది స్వప్న.
మనిషి చెట్టులా బతకాలి అని చెప్తున్నా అంటాడు కార్తీక్. చెట్టు కొత్త ఆకులను, చిగుర్లను చూస్తూ ఎదుగుతూ పోతుంది. మనిషి కూడా ఆనందాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్లాలి అంటాడు కార్తీక్. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థమవుతోంది లేరా అని మనసులో అనుకుంటుంది కాంచన. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.