రాజశేఖర్‌ హీరోగా `అపరిచితుడు`, ఆ బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్‌ ఫస్ట్ సినిమా.. ఎలా ఆగిపోయిందంటే?

Published : Aug 23, 2025, 05:37 PM IST

శంకర్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా వచ్చిన `అపరిచితుడు`కంటే ముందే రాజశేఖర్‌ హీరోగా అదే టైటిల్‌తో సినిమా రావాల్సింది. ఎలా ఆగిపోయిందనేది తెలుసుకుందాం. 

PREV
14
చిరంజీవికి పోటీ ఇచ్చిన రాజశేఖర్‌

రాజశేఖర్‌ ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా రాణించారు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్‌ వంటి వారికి పోటీ ఇచ్చిన హీరో. ఇమేజ్‌ పరంగా ఓ సమయంలో వీరిని దాటిపోయారు కూడా. వరుస విజయాలతో టాలీవుడ్‌ని షేక్‌ చేశారు. తిరుగులేని స్టార్‌ హీరోగా రాణించిన రాజశేఖర్‌ ఇప్పుడు డౌన్ అయ్యారు. ఆయన హీరోగా చేసిన సినిమాలు ఆడకపోవడంతో, సొంతంగా చేసిన సినిమాలు సైతం ఆడకపోవడంతో ఆర్థికంగానూ ఇబ్బందులు ఫేస్‌ చేయాల్సి వచ్చింది.

DID YOU KNOW ?
`జెంటిల్‌ మెన్‌` మూవీ రిజెక్ట్
రాజశేఖర్‌.. శంకర్ దర్శకత్వంలో `జెంటిల్‌మెన్‌` మూవీ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమా రిజెక్ట్ చేశారు.
24
రాజశేఖర్‌ హీరోగా `అపరిచితుడు` మూవీ

ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంటున్న రాజశేఖర్‌ ఓ యంగ్‌ హీరో సినిమాలో తండ్రిగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ రావాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో రాజశేఖర్‌ గురించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన `అపరిచితుడు` పేరుతో సినిమా చేయాల్సి ఉంది. ఓ స్టార్‌ డైరెక్టర్‌  ఈ మూవీతోనే దర్శకుడిగా పరిచయం కావాల్సింది. ఏకంగా రెండు షెడ్యూల్స్ షూటింగ్‌ కూడా పూర్తయిన తర్వాత సినిమా ఆగిపోయింది. మరి అ కథేంటో చూస్తే.

34
శ్రీనువైట్ల దర్శకత్వంలో రాజశేఖర్‌ `అపరిచితుడు`

విక్రమ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో `అపరిచితుడు` సినిమా రూపొంది సంచలన విజయం సాధించింది. 2005లో ఈ సినిమా విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో సదా హీరోయిన్‌. అయితే ఈ మూవీ రావడానికి ముందే `అపరిచితుడు` టైటిల్‌తో తెలుగులో ఓ సినిమా తెరకెక్కింది. ఇందులో రాజశేఖర్‌ హీరో. దీనికి శ్రీనువైట్ల దర్శకుడు. ఆయన దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రమిదే. దాదాపు రెండు షెడ్యూల్స్ షూటింగ్‌ కూడా జరిగింది. కానీ రాజశేఖర్‌కి, దర్శకుడు శ్రీనువైట్లకి మధ్య క్రియేటివ్‌ డిఫరెంట్స్ వచ్చింది. కథలో మార్పులు కోరారు. హీరోయిజానికి సంబంధించిన మార్పులు కోరడంతో దర్శకుడు ఒప్పుకోలేదు. దీంతో చివరికి సినిమానే పక్కన పెట్టాల్సి వచ్చింది. అలా రాజశేఖర్‌తో `అపరిచితుడు` మూవీ ఆగిపోయింది. అనంతరం విక్రమ్‌-శంకర్‌ సినిమాకి తెలుగులో అదే టైటిల్‌ పెట్టారు.

44
`నీకోసం`తో దర్శకుడిగా మారిన శ్రీనువైట్ల

`అపరిచితుడు` మూవీ ఆగిపోయిన తర్వాత కొంత గ్యాప్‌తో రవితేజ హీరోగా `నీకోసం` సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు శ్రీనువైట్ల. ఇందులో మహేశ్వరి హీరోయిన్‌. బ్రహ్మాజీ, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ డిసెంట్‌ హిట్‌గా నిలిచింది. దర్శకుడు శ్రీనువైట్లకి మంచి లైఫ్‌ ఇచ్చింది. ఆ తర్వాత `ఆనందం`, `సంతోం`, `వెంకీ`, `అందరివాడు`, `ఢీ`, `దుబాయ్‌ శీను`, `రెడీ`, `కింగ్‌`, `నమో వెంకటేశా`, `దూకుడు` వంటి చిత్రాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఫ్యామిలీ యాక్షన్‌ డ్రామాలకు శ్రీనువైట్ల కేరాఫ్‌గా నిలిచారు. దాదాపు అందరు స్టార్స్ తోనూ సినిమాలు చేసి మెప్పించారు. కానీ ఇప్పుడు శ్రీనువైట్ల కూడా దర్శకుడిగా డౌన్‌లో ఉన్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories