సూపర్ స్టార్ కృష్ణ మనవడితో స్టార్ హీరోయిన్ కూతురు రొమాన్స్.. 'మంగళవారం' డైరెక్టర్ ప్లానింగే వేరు

Published : Aug 23, 2025, 04:45 PM IST

ఘట్టమనేని వంశం నుంచి సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ కుమార్తె ఎంపికైనట్లు తెలుస్తోంది. 

PREV
15
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో

టాలీవుడ్ స్టార్ల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగించే అంశం. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ లెగసీని కంటిన్యూ చేస్తూ మహేష్ బాబు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూడా కొంతకాలం నటుడిగా రాణించారు. మూడేళ్ళ క్రితం రమేష్ బాబు అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. 

DID YOU KNOW ?
రవీనా టాండన్ తెలుగు సినిమాలు
బాలీవుడ్ నటి రవీనా టాండన్ తెలుగు చిత్రాల్లో కూడా నటించింది. బాలకృష్ణ బంగారు బుల్లోడు, నాగార్జున ఆకాశ వీధిలో చిత్రాల్లో ఆమె నటించింది. 
25
సూపర్ స్టార్ కృష్ణ మనవడు హీరోగా ఎంట్రీ 

రమేష్ బాబు కొడుకు జయకృష్ణ టాలీవుడ్ లో హీరోగా లాంచ్ అవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ అన్న కొడుకుగా జయకృష్ణ డెబ్యూ చిత్రంపై ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ఆర్ ఎక్స్ 100, మంగళవారం లాంటి విజయవంతమైన చిత్రాలు రూపొందించిన అజయ్ భూపతి దర్శకత్వం వహించబోతున్నారు. 

35
అజయ్ భూపతి దర్శకత్వంలో మూవీ 

సెప్టెంబర్ లో ఈ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు అజయ్ భూపతి స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతూ మ్యూజిక్ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తన స్టైల్ లో జయకృష్ణతో ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని అజయ్ భూపతి తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. 

45
స్టార్ హీరోయిన్ కూతురు ఎంట్రీ 

లవ్ స్టోరీ కాబట్టి హీరోయిన్ చాలా కీలకం. జయకృష్ణకి జోడిగా ఓ స్టార్ హీరోయిన్ కూతుర్ని అజయ్ భూపతి ఎంపిక చేశారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ. ఈ యంగ్ బ్యూటీ ఇప్పటికే తన గ్లామర్ తో బాలీవుడ్ లో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో తరచుగా గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. 

55
జయకృష్ణతో రషా రొమాన్స్ 

ఇప్పుడు రషా తడానీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ ఆల్రెడీ టాలీవుడ్ లో తన హవా మొదలు పెట్టింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. మరి రషా తడానీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. అజయ్ భూపతి సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ కూడా ఉంటాయి. ఈ మూవీలో రషా, జయకృష్ణ మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories