సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలని ఆసక్తి
సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరంగానే ఉంటుంది. స్టార్ హీరోలు, హీరోయిన్ల స్టైల్స్, డ్రెస్ లు, ఆహారపు అలవాట్లు, వాడుతున్న ఫోన్లు, కార్లు, ఫోన్లలో ఏ వాల్ పేపర్లు వాడతారు, సెలబ్రిటీల పేర్లను ఎలా సేవ్ చేసుకుంటారు వంటి విషయాలు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది. ఈ విషయాలను ఎవరైనా స్టార్స్ ఏదైనా ఇంటర్వ్యలో చెపితే వినడానికి ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈక్రమంలోనే తాజాగా మెగా కోడలు ఉపాసన కొనిదెల ఓ ఇంటర్వ్యూలో తన భర్త రామ్ చరణ్ గురించి చెప్పిన ఓ విషయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.