భార్య దర్శకత్వంలో నటించి అట్టర్ ఫ్లాపులు ఎదుర్కొన్న స్టార్ హీరో.. ఆస్తులు అమ్మేసుకున్నారు

Published : Jul 21, 2025, 05:50 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు తన భార్య దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించారు. కానీ ఆ చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

PREV
15

హీరో రాజశేఖర్ ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోగా వెలుగొందారు. ఒక దశలో రాజశేఖర్ వరుస విజయాలు సాధిస్తూ చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున లకు పోటీగా నిలిచారు. యాంగ్రీ హీరోగా రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అయితే ఇటీవల రాజశేఖర్ సినిమాలు బాగా తగ్గించారు. రాజశేఖర్ హీరోయిన్ జీవితని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

25

జీవిత నటిగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా కూడా పనిచేశారు. సొంతంగా సినిమాలు నిర్మించడం వల్ల, తన ఇమేజ్ కి భిన్నంగా ఉండే సినిమాలు చేయడం వల్ల పరాజయాలు ఎదుర్కొన్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ తన భార్య జీవిత దర్శకత్వంలో నటించిన చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

35

రాజశేఖర్ మాట్లాడుతూ..నా కెరీర్ లో ఎక్కువగా నా ఇమేజ్ కి సరిపోని చిత్రాలే చేశాను. శేషు మూవీ చాలా మంచి కథ. కానీ కొత్త వాళ్ళు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది. నా ఇమేజ్ కి సరిపోలేదు. క్లైమాక్స్ సీన్లు మార్చి ఉన్నా ఆ చిత్రం హిట్ అయ్యేది. ప్రేక్షకులు శేషు మూవీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. కానీ చివర్లో మెంటల్ హాస్పిటల్ సీన్స్ విషయంలో డిజప్పాయింట్ అయ్యారు. 

45

క్లైమాక్స్ ని మార్చి మాస్ గా పెట్టాలని అనుకున్నాం. అది తమిళంలో హిట్ అయిన  సేతు చిత్రానికి రీమేక్. బాల దర్శకత్వంలో విక్రమ్ నటించిన చిత్రం అది. క్లైమాక్స్ ని మార్చితే ఒరిజినల్ కథని పాడుచేసినట్లు అవుతుంది అని అలా చేయలేదు. క్లైమాక్స్ మార్చకపోవడమే శేషు చిత్రానికి మైనస్ అని రాజశేఖర్ అన్నారు. ఈ చిత్రం జీవిత దర్శకత్వంలో తెరకెక్కింది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ దర్శకత్వం బాగా చేశారని బాల గారు జీవితని అభినందించినట్లు రాజశేఖర్ తెలిపారు. 

55

అదే విధంగా మహంకాళి చిత్రం కూడా నా ఇమేజ్ కి సరిపోయే కథ కాదు. ఆ మూవీని మేమే నిర్మించాం. జీవిత దర్శకత్వంలో తెరకెక్కింది. ఆ చిత్రం కూడా ఫ్లాప్ అయింది. ఆప్తుడు చిత్రం పరిస్థితి కూడా అంతే. ఆ తర్వాత గడ్డం గ్యాంగ్ చిత్రాన్ని నిర్మించాం అది కూడా ఫ్లాప్ అయింది. ఈ చిత్రాల వల్ల తమ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది అని రాజశేఖర్ తెలిపారు. శేషు, మహంకాళి లాంటి చిత్రాలకు జీవిత దర్శకత్వమే మైనస్సా అని యాంకర్ ప్రశ్నించగా కాదని రాజశేఖర్ అన్నారు. ఆ కథలు ఎంచుకోవడమే మేము చేసిన తప్పు. జీవిత దర్శకత్వం వహించిన ఎవడైతే నాకేంటి హిట్ అయింది కదా అని రాజశేఖర్ అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories