ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 17వ శాతాబ్దంలో జరిగే కథ ఇది అని, మొఘల్ సామ్రాజ్యం ఇండియాని రాజ్యమేలుతున్న కాలంలో జరిగే కథ అని,
అప్పటి మన విజయవాడ సమీపంలో దొరికిన కొహినూర్ వజ్రం మన నిజాం రాజుల వద్దకు ఎలా వెళ్లింది? అక్కట్నుంచి బ్రిటీష్ వారి చేతుల్లో ఎలా పడింది? దాని కోసం వీరమల్లు పాత్ర ఏం చేసిందనేది ఈ సినిమా కథగా ఉంటుందని తెలిపారు పవన్.
మొఘల్ సామ్రాజ్యంలోని రాజు అయిన ఔరంగజేబ్ పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉంటుంందని, ఆ పాత్ర కోసం మొదట వేరే ఒకరిద్దరు నటులను అనుకున్నారట. ఒక నటుడితో షూటింగ్ కూడా చేశారట.
కానీ బాగా రాలేదని, ఆ తర్వాత బాబీ డియోల్‌ని తీసుకున్నామని, ఆయన ఈ పాత్రకి పర్‌ఫెక్ట్ సూట్ అయ్యారని, అంతే బాగా చేశారని తెలిపారు పవన్ కళ్యాణ్. ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.