
మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ `ది రాజాసాబ్` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. సినిమాని ఆయన రొమాంటిక్ కామెడీ హర్రర్ ఫాంటసీగా రూపొందిస్తున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ హర్రర్ ఫాంటసీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మారుతి. ఇందులో మాళవిక మోహనన్‌తోపాటు నిధి అగర్వాల్, అలాగే రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. ఇందులో ప్రభాస్‌తోపాటు మాళవిక సీన్ కూడా ఉంది. బెడ్ సీన్ కామెడీ ఆకట్టుకుంది. చాలా రొమాంటిక్‌గా ఉంది. ఈ మూవీతోనే మాళవిక టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. అయితే మాళవిక తెలుగులో కమిట్ అయిన ఫస్ట్ మూవీ `ది రాజాసాబ్` కాదు. ఆమె ఆరేళ్ల క్రితమే మరో సినిమాకి కమిట్ అయ్యింది. ఆ చిత్రం ఓపెనింగ్ జరుపుకుని కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. కానీ అనూహ్యం ఆగిపోయింది. ఆ వివరాలు చూస్తే.
మాళవిక మోహనన్ తెలుగులో కమిట్ అయిన మొదటి చిత్రం `హీరో`. విజయ్ దేవరకొండ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. విజయ్, మాళవికలపై ఓపెనింగ్ చేశారు. దీనికి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు. ఆనంద్ అన్నమలై దర్శకుడు. స్పోర్ట్స్ డ్రామా కథాంశంతో సాగే ఈ మూవీలో రేసర్‌గా విజయ్ దేవరకొండ నటించాల్సి ఉంది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే ఆగిపోయింది. క్రియేటివ్ డిఫరెంట్స్ కారణంగా సినిమా ఆగిపోయినట్టు సమాచారం. అలా మాళవిక ఆరేళ్ల క్రితమే తెలుగులో `హీరో` మూవీతో హీరోయిన్‌గా పరిచయం కావాల్సింది. అది ఆగిపోవడంతో ఇప్పుడు `రాజాసాబ్`తో ఎంట్రీ ఇస్తుంది. ఇది ఆమెకి గ్రాండ్ ఎంట్రీ అని చెప్పాలి.
కేరళాకి చెందిన మాళవిక మోహనన్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే యూ మోహనన్ కూతురు. 2013లోనే మలయాళంలో `పట్టం పోలే` చిత్రంతోనే హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. కన్నడలోకి `నాను మట్టు వరలక్ష్మి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తమిళంలో రజనీకాంత్ `పేటా` చిత్రంలో నటించింది. `మాస్టర్`, `మారన్`, `తంగళాన్` చిత్రాలతో తమిళ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రభాస్ `రాజాసాబ్`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీ జనవరి 9న విడుదల కాబోతుంది. దీంతోపాటు తమిళంలో `సర్దార్ 2`లో నటిస్తుంది మాళవిక. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది మాళవిక.
ఇక విజయ్ దేవరకొండ ఇటీవల `కింగ్డమ్` మూవీతో ఆకట్టుకున్నారు. ఇది యావరేజ్‌గా నిలిచింది. నిర్మాతలకు నష్టాలను తెచ్చింది. ఇప్పుడు రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఒక హిస్టారికల్ స్టోరీతో రూపొందబోతుందని తెలుస్తోంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. దీంతోపాటు రవికిరణ్ కొల్లా దర్శకత్వంలో `రౌడీ జనార్థన్` అనే సినిమా చేయాల్సి ఉంది. దీనికి దిల్ రాజు నిర్మాత.