40 ఏళ్లు దాటినా నో పెళ్లి అంటున్న హీరోయిన్స్

Published : Sep 17, 2025, 03:24 PM IST

Unmarried Heroines Over 40: సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కొందరూ కెరీర్‌పై దృష్టి పెడితే, మరికొందరూ వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లికి దూరంగా ఉన్నారు. అలా పెళ్లికి దూరంగా ఉన్న స్టార్ హీరోయిన్స్ వీళ్లే..

PREV
18
40 ఏళ్లు దాటినా పెళ్లి వద్దన్న హీరోయిన్స్ వీళ్లే!

Unmarried Heroines: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌ లు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌ అవుతూనే ఉంటారు. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించే వీరు వ్యక్తిగత జీవితంలో మాత్రం విభిన్న నిర్ణయాలు తీసుకుంటారు. చాలామంది హీరోయిన్స్ కెరీర్ మధ్యలోనే పెళ్లి చేసుకుని, కుటుంబ జీవితాన్ని ఎంచుకుంటారు. అయితే కొందరు మాత్రం 40 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు. వాళ్లలో కొందరి గురించి వివరంగా చూద్దాం.

28
త్రిష

టాలీవుడ్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. దాదాపు 20 ఏళ్లకు పైగా హీరోయిన్‌గా కొనసాగుతూ, ఇంకా టాప్ హీరోయిన్‌గానే బిజీగా ఉంది. తెలుగులో మహేష్ బాబు, చిరంజీవి, బాలయ్య, వెంకటేష్‌ వంటి స్టార్ హీరోలతో పాటు తమిళంలో విజయ్, అజిత్‌ వంటి సూపర్‌స్టార్లతో జంటగా నటించి మెప్పించింది. త్రిష పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన సందర్భం కూడా ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత వరుణ్మణియన్‌తో నిశ్చితార్థం వరకు వెళ్లింది. కానీ, అనూహ్యంగా విభేదాలు రావడంతో ఆ బంధం అక్కడే ముగిసిపోయింది. అలాగే రానా దగ్గుబాటితో డేటింగ్‌లో ఉందన్న రూమర్స్, విజయ్ దళపతితో రిలేషన్‌లో ఉందన్న గాసిప్స్ కూడా వచ్చాయి. అయినా పెళ్లి విషయంలో మాత్రం ఇప్పటి వరకు త్రిష ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ‘థగ్ లైఫ్’వంటి పెద్ద సినిమాలతో బిజీగా ఉంది.

38
అనుష్క శెట్టి

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి వయసు 43. అరుంధతి, బాహుబలి, భాగమతి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల ద్వారా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. అనుష్క- ప్రభాస్ లవ్‌లో ఉన్నారనే వార్తలు ఎన్నో సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి. అభిమానులు వీరికి AI టెక్నాలజీతో పెళ్లి చేసి ఫోటోలు కూడా వైరల్ చేశారు. కానీ ఇద్దరూ ఎప్పటికీ “మేము మంచి స్నేహితులమే” అని చెప్పారు. అనుష్క పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. వరుస సినిమాలు చేస్తూ.. సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

48
టబు

సీనియర్ హీరోయిన్ టబు వయసు 53 అయినా ఇప్పటికీ ఒంటరిగా ఉంది. 90లలో టాలీవుడ్ , బాలీవుడ్, కోలివుడ్ ల్లో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. ఇప్పటికీ అగ్రనటుల సరసన ముఖ్యమైన పాత్రలు చేస్తూనే ఉంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌తో టబు లవ్‌లో ఉందన్న టాక్ బలంగా వినిపించింది. టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కూడా ఎఫైర్ ఉందన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయినప్పటికీ టబు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను చాలా కాలం క్రితమే వదిలేసిందని స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం ఒంటరిగా ఉన్నప్పటికీ తన కెరీర్‌ను అద్భుతంగా కొనసాగిస్తోంది.

58
నగ్మా

90వ దశకంలో సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన నగ్మా చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి పెద్ద హీరోల సరసన నటించింది. భోజ్‌పురి, మరాఠీ సినిమాల్లో కూడా నటించింది. అయితే తర్వాత హీరోయిన్ అవకాశాలు తగ్గిపోవడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నగ్మా వయసు 50 దాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో లవ్‌లో ఉందన్న గాసిప్స్ అప్పట్లో చాలా హాట్ టాపిక్ అయ్యాయి. కానీ ఆ సంబంధం కూడా కొనసాగలేదు. ప్రస్తుతం నగ్మా రాజకీయాల్లో బిజీగా ఉంది.

68
సుష్మితా సేన్

1994లో మిస్ యూనివర్స్ గెలిచిన సుష్మితా సేన్ వయసు 49 అయినా ఇప్పటికీ పెళ్లి కాలేదు. తన లైఫ్‌ను తన స్టైల్లోనే గడుపుతోంది. ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుని సింగిల్ మదర్‌గా పెంచుతోంది. బిజినెస్ మాగ్నేట్ రోమన్ షాల్‌తో డేటింగ్‌లో ఉందన్న వార్తలు వచ్చినా, పెళ్లి మాత్రం చేసుకోలేదు. సుష్మితా ఎప్పటికప్పుడు “పెళ్లి ఒక్కటే జీవితంలో ఆనందానికి మార్గం కాదు” అని చెబుతూ ఉంటుంది.

78
అమీషా పటేల్

‘కహో నా ప్యార్ హై’తో బాలీవుడ్‌లో, ‘బద్రి’తో టాలీవుడ్‌లో మెరిసిన అమీషా పటేల్ ప్రస్తుతం 45 ఏళ్లు దాటినా ఇంకా సింగిల్‌గానే ఉంది. పర్సనల్ లైఫ్‌లో చాలా రిలేషన్‌షిప్స్‌లో ఉన్నా పెళ్లి దాకా వెళ్లలేదు. ఇప్పటికీ తన అందాన్ని మెయింటైన్ చేస్తూ, కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

88
శోభన

80, 90లలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శోభన వయసు 51 దాటినా ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. నృత్యకళలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. శోభన పెళ్లి ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు, “ఒంటరిగా ఉన్నా జీవితం సంతోషంగా ఉంటుంది. పెళ్లే ఒక్కటే ఆనందానికి కారణం కాదు” అనే పిలాసఫీ చెబుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories