పవన్ కళ్యాణ్ తో బ్రహ్మానందం, అలీ లాంటి కమెడియన్లు ఎందరో నటించారు. కానీ ఓ కమెడియన్ అంటే మాత్రం పవన్ కి ప్రత్యేకమైన అభిమానం ఉందట. ఆ కమెడియన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చాలా మంది కమెడియన్లతో కలసి నటించారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, సునీల్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్ లాంటి కమెడియన్లతో పవన్ నటించిన సినిమాలు ఉన్నాయి. కానీ ఓ కమెడియన్ అంటే పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన అభిమానం ఉందట. పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన కమెడియన్ అంటే బ్రహ్మానందం, అలీ లాంటి టాప్ కమెడియన్లు అనుకుంటే పొరపాటే. ఆ కమెడియన్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం.
25
జయం మూవీతో ఎంట్రీ
డైరెక్టర్ తేజ టాలీవుడ్ లో చాలా మంది నటీనటుల్ని పరిచయం చేశారు. తేజ పరిచయం చేసిన కమెడియన్లలో సుమన్ శెట్టి ఒకరు. జయం చిత్రంతో సుమన్ శెట్టి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. సుమన్ శెట్టి ఉండే వైవిధ్యమైన వాయిస్ అతడికి బలం. జయం తర్వాత చాలా చిత్రాల్లో సుమన్ శెట్టికి కమెడియన్ గా ఛాన్స్ వచ్చింది. సుమన్ శెట్టి కామెడీ అంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం అట. జయం మూవీ నుంచి సుమన్ శెట్టి నటించిన చిత్రాలని పవన్ చూస్తున్నారట. ఓ ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి మాట్లాడుతూ.. జయం మూవీ నుంచి తన కామెడీ ని ఎంజాయ్ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు అని అన్నారు.
35
సుమన్ శెట్టికి ఇష్టమైన హీరోలు
అంత పెద్ద స్టార్ హీరోకి నా కామెడీ నచ్చడం చాలా అదృష్టం అని సుమన్ శెట్టి తెలిపారు. టాలీవుడ్ లో నేను ఇష్టపడే హీరోలు ముగ్గురు ఉన్నారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్, మహేష్ బాబు అంటే తనకి చాలా ఇష్టం అని సుమన్ శెట్టి పేర్కొన్నారు. ఈ ముగ్గురితో తాను సినిమాలు చేశానని సుమన్ శెట్టి పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ గారితో అన్నవరం సినిమాలో నటించాను. అన్నవరం మూవీ షూటింగ్ కి తొలి రోజు వెళ్ళినప్పుడు.. పవన్ కళ్యాణ్ గారు నన్ను చూసి.. హాయ్ సుమన్.. నువ్వంటే నాకు ఇష్టం, నేను నీ ఫ్యాన్ ని.. నీ కళ్ళు బావుంటాయి.. నీ సినిమాలు నేను చూస్తుంటాను అని అన్నారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ తర్వాత నన్ను గుర్తు పెట్టుకుని మరీ సర్దార్ గబ్బర్ సింగ్ లో అవకాశం ఇచ్చారు అని సుమన్ శెట్టి గుర్తు చేసుకున్నారు. బరువు తగ్గేందుకు పవన్ కళ్యాణ్ గారు నాకు విలువైన సలహాలు కూడా ఇచ్చారు. మార్కింగ్ హాట్ వాటర్, లెమెన్ వాటర్ తాగమని చెప్పినట్లు సుమన్ శెట్టి గుర్తు చేసుకున్నారు.
55
సుమన్ శెట్టి నటించిన చిత్రాలు
సుమన్ శెట్టి తన కెరీర్ లో జయం, నిజం, అన్నవరం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఎందుకంటే ప్రేమంట లాంటి చిత్రాల్లో నటించారు. అదే విధంగా 7జి బృందావన కాలనీ చిత్రంలో కూడా సుమన్ శెట్టి నటించారు. ఆ మూవీలో సుమన్ శెట్టి కామెడీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. ప్రస్తుతం సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సందడి చేస్తున్నారు.