సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న రాజమౌళి సినిమా ఓపెనింగ్ జరిగింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అని అంతా అనుకుంటున్న టైమ్ లో ఈసినిమాకు సబంధించిన సాలిడ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
అదేంటంటే..? త్వరలో ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నారట టీమ్. ఇందుకు సబంధించిన పనులన్నీ ఒక వైపు జరుగుతుండగా.. ఈలోపు మహేష బాబును ఆఫ్రీకాలోని అతి భయంకరమైన అడవుల్లోకి తీసుకెళ్ళబోతున్నాడట జక్కన్న.
Alao Read: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు అన్నగా స్టార్ హీరో..? బ్లాక్ బస్టర్ రిపీట్ అవుతుందా..?
అయితే షూటింగ్ కూడా ఇండియాలో కాకుండా ఫారెన్ షెడ్యూల్ తో స్టార్ట్ చేయబోతున్నారట. అయితే ఫారెన్ షెడ్యుల్ అయితే బాగుంటుంది. ఎంజాయ్ చేస్తాడు లే హీరో అని అనుకోవద్దు. ఎందుకంటే ఫారెన్ షెడ్యుల్ అంటే ఏ అమెరికానో.. ఆస్ట్రేలియానో కాదు.. ఆఫ్రీకాలో అది కూడా అడవిలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసేలోపు మహేష్ బాబును ఆఫ్రీకాలోని కొన్ని ట్రైబ్స్ మధ్య ఓ నెలరోజులు గడిపేలా ప్లాన్ చేస్తున్నాడట.
Also Read: చైతూ, శోభిత తొలి సంక్రాంతి ఎక్కడ జరుపుకున్నారో తెలుసా..?
అక్కడ అలవాట్లు, వాతావరణ, వారి కట్టుబాట్లు మొత్తం నేర్చుకునేలా క్యాంప్ ను నిర్వహాంచబోతున్నాడట జక్కన్న. అంతే కాదు ఇది పాన్ వరల్డ్ మూవీ కావడంతో.. యాక్షన్ అడ్వెంచర్ కావడంతో మహేష్ ఇప్పటికే జపాన్ లో చాలారోజులు ఉండి మర్షల్ ఆర్ట్స్ ను ప్రాక్టీస్ చేశాడు. ఇక ఇందులో మరింత రాటుదేలడంతో పాటు.. పర్ఫెక్ట్ అవ్వడం కోసం చైనాలో కూడా మహేష్ బాబు పర్యటించబోతున్నారట.
Also Read:హార్దిక్ పాండ్యా తో పీకల్లోతు ప్రేమలో జాన్వీ కపూర్..?
అక్కడ కొంత కాలం ఉండి మార్షలాట్స్ లో పర్ఫెక్ట్ అవ్వబోతున్నారట. ఇక ఇప్పిటీకే దానికి సబందించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఈమూవీ ఓపెనింగ్ జరిగింది. అయితే ఈ ఓపెనింగ్ కు సబంధించిన ఫోటోలు కాని, వీడియోలు కాని బయటకు రాలేదు. ఏ సినిమా అయినా ముందే ఆ సినిమాకు సబంధించిన వివరాలు వెల్లడించే రాజమౌళి.. ఈసినిమా విషయంలో చాలా సీక్రేట్ ను మెయింటేన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read:షకీలా ఎవరిచేతుల్లో మోసపోయింది..?