బాలకృష్ణ వంద కోట్ల సినిమాలు ఎన్నో తెలుసా? సీనియర్‌ హీరోల్లో బాలయ్య రేర్‌ ఫీట్‌

First Published | Jan 15, 2025, 3:22 PM IST

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోల్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో పోల్చితే బాలయ్య రేర్‌ ఫీట్‌ సాధించారు. వరుసగా అత్యధికంగా వంద కోట్లు సినిమాలు చేసిన హీరోగా నిలిచారు. 
 

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నారు. సీరియర్‌ హీరోల్లో యమ జోరు చూపిస్తున్నారు. బాలయ్య కెరీర్‌లో చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి రేర్‌ ఫీట్‌ని సాధించారు. అంతేకాదు సీనియర్‌ హీరోల్లోనూ బాలయ్యదే రేర్‌ ఫీట్. బ్యాక్‌ టూ బ్యాక్‌ వంద కోట్ల సినిమాలు సాధించిన హీరోగా బాలయ్య రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు నాలుగు వంద కోట్ల సినిమాలను అందించడం విశేషం. 
 

బాలకృష్ణకి ఒకప్పుడు బోయపాటి మాత్రమే సక్సెస్‌ ఇస్తారనే ముద్ర పడింది. ఆ మధ్య అలాంటి పరిస్థితే వచ్చింది. కానీ ఆయనే కాదు, ఇతర దర్శకులు కూడా దాన్ని చూపిస్తున్నారు. అయితే మొదటి వంద కోట్ల సినిమాని చేసింది మాత్రం బోయపాటి అనే చెప్పాలి. `అఖండ`తో దీన్ని స్టార్ట్ చేశారు. 2021లో వచ్చిన `అఖండ` సినిమా ప్రపంచ వ్యాప్తంగా 133కోట్ల వసూళ్లని రాబట్టింది. బాలకృష్ణ తొలి వంద కోట్ల మూవీగా నిలిచింది. 


ఆ తర్వాత `వీరసింహారెడ్డి`తో మరో వంద కోట్ల సినిమా అందించారు బాలయ్య. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023లో సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ మూవీ కూడా 134కోట్లు రాబట్టింది. మిశ్రమ స్పందన రాబట్టుకున్నా ఈ రేంజ్‌ కలెక్షన్లు సాధించడం విశేషం. 

ఇక అదే ఏడాది `భగవంత్ కేసరి`తో వచ్చాడు బాలయ్య. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సైతం భారీ విజయం సాధించింది. రూ.132 కోట్లు వసూలు చేసింది. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకి లాభాలు పండించింది. ఇలా వరుసగా మూడు వంద కోట్ల సినిమాలను అందించి హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు బాలయ్య. అంతేకాదు మరో హ్యాట్రిక్‌ కి పునాది వేశాడు. 

ఈ సంక్రాంతికి మరో వంద కోట్ల సినిమాతో వచ్చాడు. తాజాగా బాలయ్య `డాకు మహారాజ్‌` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలైంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.92కోట్లు వసూలు చేసింది. నేడు (బుధవారం)తో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరబోతుంది.

అంతేకాదు ఈ సినిమా లాంగ్‌ రన్‌లో రెండు వందల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ఇదే నిజమైతే బాలయ్య తొలి రెండు వందల కోట్ల మూవీ కాబోతుందని చెప్పొచ్చు. 

read more: ఆ నెగిటివ్ పాత్రలో నటించే ఛాన్స్ నాకు జీవితంలో వస్తుందో రాదో.. బాలయ్య క్రేజీ కామెంట్స్ వైరల్
 

ఇదిలా ఉంటే సినియర్‌ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ లలో ఇలా వరుసగా నాలుగు వంద కోట్ల సినిమాలు చేసిన హీరో బాలయ్య ఒక్కరే కావడం విశేషం. ఈ రేర్‌ ఫీట్‌ అందుకున్న హీరోగా బాలయ్య రికార్డు సృష్టించారు. అంతేకాదు ఇప్పుడు `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే మహా కుంభమేళాలో ప్రారంభమైంది.

ఈ సినిమా కూడా వంద కోట్ల మూవీ కాబోతుందని చెప్పొచ్చు. `అఖండ` మాదిరిగానే ఉంటే, ఇప్పుడున్న బాలయ్య జోరుకి, మార్కెట్‌ కి ఇది రెండు వంద కోట్లు కూడా ఈజీగా దాటేస్తుంది. వరుసగా ఐదు వంద కోట్ల సినిమాలు చేసిన హీరోగా బాలయ్య సరికొత్త రికార్డు క్రియేట్‌ చేస్తారని చెప్పొచ్చు. 

read  more: మళ్లీ రాజుకున్న మోహన్‌ బాబు ఫ్యామిలీ గొడవ?, ర్యాలీగా మంచు మనోజ్.. మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

also read: `గేమ్‌ ఛేంజర్‌` నేను బాగా చేశాను, ఫలితంపై శంకర్‌ సంచలన స్టేట్‌మెంట్‌.. కారణం ఎవరు?
 

Latest Videos

click me!