ప్రభాస్ కు కోపం తెప్పించే పని అదొక్కటే, స్వయంగా వెల్లడించిన రాజమౌళి..

First Published | Apr 21, 2024, 8:07 AM IST

చాలా కూల్ గా కామ్ గా ఉంటాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అలాంటి వ్యక్తికి కోపం తెప్పించాలంటే చాలా కష్టం. కాని ప్రభాస్ కు ఒక పనిచేస్తే మాత్రం ఒళ్ళు మండిపోతుందట. ఈ విషయం స్వయంగా స్టార్ డైరెక్టర్ జక్కన్నే చెప్పాడు మరి. 

Prabhas Kalki 2898 AD film update out

ప్రభాస్ ఆరడుగుల కటౌట్.. కాని ఆయన చాలా కూల్ గా కామ్ గా ఉంటాడు. అవసరం అయినప్పుడే స్పందిస్తారు. ఎప్ప్పుడు పడితే అప్పుడు.. ఎలా పడితే అలా మాట్లాడడు. పాన్ ఇండియా హీరో కదా.. కాస్త ఇప్పుడు ఆ మెయింటేనెస్ ఇంకా పెరిగిపోయింది. అయితే ప్రభాస్ కు సబంధించిన ఓ న్యూన్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే.. ? 

ప్రభాస్ చాలా కామ్ గా ఉంటాడు కదా.. ? కూల్ గా కూడా ఉంటాడు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయనకు ఒళ్ళ మండి పోతుందట. ఈవిషయం రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో  వెల్లడించారు. ఇంతకీ ఏ పని చేస్తే ప్రభాస్ కు కోపం వస్తుందో తెలుసా.. ఆయను విసిగిస్తూ.. చేసిన పనే పదే పదే చేయమంటే చిర్రెత్తుకోస్తుందట

సౌందర్య 100 కోట్ల ఆస్తీ ఏమయ్యింది..? రహస్య వీలునామాలో ఏముంది..? సంచలన నిజాలు..?


ఇక ప్రభాస్ కి కోపం తెప్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కెమెరామెన్ సెంధిల్ కుమార్  మాత్రమే అని వెల్లడించారు రాజమౌళి. ఎందుకంటే ప్రభాస్ కి పదేపదే విసిగిస్తే చాలా కోపం అట . సెందిల్ కుమార్ వర్క్ విషయంలో  పర్ఫెక్ట్ . ఒక రకంగా చెప్పాలంటే నాకంటే పర్ఫెక్ట్ గా ఉంటాడు సెంథిల్. అందుకే పని విషయంలో హీరోలకు కోపం వచ్చినా..సెంథిల్ మాత్రం అవుట్ పుట్ కోసం కష్టపడతాడు అన్నారు జక్కన్న. 

హీరో విజయ్ కి ప్రమాదం, గాయాలతో ఓటు వేయడానికి వచ్చిన దళపతి,

ఈక్రమంలో ఆర్టిస్టు రెడీ అయ్యేటప్పుడు కూడా ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అవుతున్నాడు అని సెంథిల్  రీ చెక్ చేసే టైప్. కాని ఈ విషయంలో ప్రభాస్ కు మాత్రం బాగా కోపం వస్తుంది.  అలా చేస్తే ప్రభాస్ కి ఒళ్ళు మండిపోతుంది. అయినా సరే సెంథిల్ ఇవన్నీ పట్టించుకోడు.  తన పని తాను చేసుకుంటూ ఉంటాడు అన్నారు రాజమౌళి. 

మహేష్ బాబు సినిమాలో సిమ్రాన్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదుగా..

అయితే  ప్రభాస్ తన కోపం చూపించినా.. సెంథిల్ తో ఉన్న ఫ్రెడ్షిప్ కారణంగా అది పెద్దగా పనిచేయదు. ఇద్దరు సరదాగా తిట్టుకుంటారు.. అంతలోనే కలిసి కబుర్లు చెప్పుకుంటారు. అందుకే వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడం మరీ మరీ స్పెషల్ అన్నారు స్టార్ డైరెక్టర్. ఇక జక్కన్న అప్పుడు అన్న మాటలు ఇప్పుడు కూడా వైరల్ అవుతున్నాయి. 

ప్రస్తుతం రాజమౌళి..మహేష్ బాబు సినిమా ఓపెనింగ్ కు రెడీ అవుతున్నాడు. అటు ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు కల్కీ సినిమాతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు యంగ్ రెబల్ స్టార్. 

Latest Videos

click me!