హాలీవుడ్‌ ముదురు హీరోయిన్‌ని పట్టిన శుభ్‌ మన్‌ గిల్‌.. ఆ మ్యాచ్‌లో రచ్చ.. సారాని వదిలేసినట్టేనా?

First Published | Apr 20, 2024, 10:21 PM IST

గుజరాత్‌ టైటాన్స్ క్రికెటర్‌ శుభ్‌ మన్‌ గిల్‌.. సారా టెండుల్కర్‌లో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు లవర్‌ని మార్చాడట. విదేశీ హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్నాడట. 
 

ఐపీఎల్‌ స్టార్‌, సెన్సేషనల్‌ క్రికెటర్‌ శుభ్‌ మన్‌ గిల్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సారాతో ఆయన డేటింగ్‌, ఆయన సంచలన ఆటతీరు ఆకట్టుకుంటుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది. క్రికెట్‌ స్టేడియంలో ఆయన చేసే రచ్చ కూడా హాట్‌ టాపిక్ అవుతుంటుంది. అదే సమయంలో హ్యాండ్సమ్‌ క్రికెట్ గా వార్తల్లో నిలుస్తుంటాడు శుభమన్‌ గిల్‌. 

శుభ్‌ మన్‌ గిల్‌ అందానికి ఎంతో మంది అమ్మాయిలు ఫిదా అవుతుంటారు. ఆయనపై క్రష్‌ పెంచుకుంటున్నారు. ఆ లిస్ట్ లో సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. హీరోయిన్లు కూడా శుభ్‌ మన్‌ గిల్‌పై మోజు పడుతున్నారట. అయితే మనోడు మాత్రం ఏకంగా లెజెండ్‌ క్రికెటర్‌ సచిన్‌ కూతురుతో డేటింగ్‌ చేస్తున్నారు. సారా టెండుల్కర్‌, గిల్‌ చాలా రోజులుగా డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 


ఇద్దరు కలిసి చాలా సార్లు కెమెరాలకు దొరికిపోయారు. అదే సమయంలో గిల్‌ ఆడే మ్యాచ్‌ల్లో సారా పాల్గొని ఆయనకు ఎంకరేజ్‌మెంట్‌ ఇవ్వడం చర్చనీయాంశం అవుతుంది. దీంతో ఇద్దరు ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. అంతకు ముందు సారా అలీ ఖాన్‌తోనూ రూమర్లు వచ్చాయి. చాలా రోజు రచ్చ చేశాయి. కానీ ఇప్పుడు మరో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు గిల్‌. కొత్త వార్త క్రికెట్‌ ప్రపంచాన్ని, సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. 
 

గుజరాత్ టైటాన్స్ కి ప్రాతినిథ్యం వహిస్తున్న గిల్‌ లవర్‌ని మార్చాడనే పుకారు ఊపందుకుంది. విదేశీ హీరోయిన్‌తో గిల్‌ ప్రేమలో పడ్డాడట. ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తుంది. అంతేకాదు గిల్‌ కోసం ఆమె ఇండియాకి వచ్చినందని తెలుస్తుంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఆమె సందడి చేయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా, హాట్‌ టాపిక్‌గా మారింది. 

శుభ్‌ మన్‌ గిల్‌.. ఇప్పుడు క్యూబా హీరోయిన్‌గా ప్రేమలో పడ్డాడట. ఆమెతో రొమాన్స్ చేస్తున్నాడని తెలుస్తుంది. మరి ఆమె ఎవరు అనేది చూస్తే, క్యూబాకి చెందిన హీరోయిన్‌ అనా డి ఆర్మాస్‌ అని తేలిసింది. ఆమె ఏప్రిల్‌ 17న జరిగిన గుజరాత్‌ టైటాన్స్, ఢిల్లీ క్యాపిట్స్ తో జరిగిన మ్యాచ్‌ టైమ్‌లో ఆమె స్టేడియంలో మెరిసింది. గిల్‌ ఆడే సమయంలో ఆమె సందడి చేసింది. జస్ట్ టాప్‌లో మెరిసిన అనా డి అర్మాస్‌.. అర్థనగ్న షోతో హైలైట్ గా నిలిచింది. దీంతో ఆమెని బంధించేందుకు కెమెరాలు పోటీపడటం విశేషం. 
 

ఆ వీడియోలు, ఫోటోలను చూసి ఆమె గిల్‌ కోసం వచ్చిందని, గిల్‌ కొత్త గర్ల్ ఫ్రెండ్‌ అని కామెంట్లతో రచ్చ చేస్తున్నారు క్రికెట్‌ అభిమానులు. అంతేకాదు మ్యాచ్‌ కంటే ఆమెపైనే అంతా ఫోకస్‌ పెట్టారు. ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెకి గురించి అనేక విషయాలను కనిపెట్టారు. బయటపెట్టారు. అవి వైరల్‌ అవుతున్నాయి. 
 

అనా డీ ఆర్మాస్ క్యూబాకి చెందిన స్టార్‌ హీరోయిన్‌. ఆమె పూర్తి పేరు  అనా సెల్జా డీ ఆర్మాస్. ఆమె వయసు 36. క్యూబా, స్పానిష్ నటిగా పాపులర్‌ అయ్యింది. 18 ఏళ్ల వయసులోనే `ఉనా రోసా డీ ఫ్రాన్సియా ` అనే సినిమా ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఎల్ ఇంటెర్నాడో అనే పాపులర్ డ్రామాలో నటిస్తూ మాడ్రిడ్ స్పెయిన్ దేశాల్లో తిరుగుతూ భారత్‌కు చేరుకొన్నది. అనా డి ఆర్మాస్‌.. మార్క్ క్లోటెట్ అనే వ్యక్తిని 2011లో పెళ్లి చేసుకుంది. 2013లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటుడు పాల్‌ బాకాడాకిస్‌తో డేటింగ్‌లో ఉంది. కానీ ఇప్పుడు ఆమె అతనికి బ్రేకప్‌ చెప్పినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే గిల్‌ సైతం సారాకి బ్రేకప్‌ చెప్పినట్టే అంటున్నారు. ఈ కొత్త లవర్‌ కోసం ఆమెని పక్కన పెట్టాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కొత్త రూమర్డ్ జోడీలో నిజమెంతా, నిజంగానే అనా డి ఆర్మాస్‌ గిల్‌ కోసం వచ్చిందా? అనేది ఆసక్తితో కూడా సస్పెన్స్. నిజం ఏంటనేది మున్ముందు తేలనుంది. కానీ ఇప్పుడు ఇండియన్‌ మీడియాలో క్యూబా హీరోయిన్‌ చర్చనీయాంశంగా మారింది. ఇది ఆమెకి ఇండియన్‌ సినిమాల్లో ఆఫర్లని తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. 
 

Latest Videos

click me!