రాజమౌళిని పోరా అంటూ అవమానించింది ఎవరు, జక్కన్న మర్చిపోలేని సంఘటన

First Published | Nov 22, 2024, 4:30 PM IST

దేశం మెచ్చిన దర్శకుడు రాజమౌళి. ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉంటాడు. అటువంటి దర్శక ధీరుడిని పోరా అంటూ అవమానించింది ఎవరో తెలుసా..? 

రాజమౌళి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకన్న ఆయన.. తన సినిమాలతో తాను ఎదుగుతూ.. ఇటు టాలీవుడ్ కు కూడా హాలీవుడ్ రేంజ్ ను తీసుకువచ్చాడు. తెలుగు సినీ పరిశ్రమను చీఫ్ గా చూస్తూ.. అసలు గుర్తింపు ఇవ్వని బాలీవుడ్, కోలీవుడ్ కు తగిన బుద్ది చెప్పి.. తెలుగు పరిశ్రమ టాలెంట్ ను హాలీవుడ్ రేంజ్ లో చూపించాడు. 

Also Read: జపాన్ -చైనాలో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?
 

ఆస్కార్ సాధించిన అత్యున్నత శిఖరాలకు ఎక్కడాడు. ఇప్పుడు బాలీవుడ్,కోలీవుడ్ మాత్రమే కాదు అన్ని భాషల్లో స్టార్లు, అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో మన తెలుగు ఆర్టిస్ట్ లు, డైరెక్టర్లు, తెలుగు సినిమాల కోసం ఎదరు చూస్తున్నారంటే ఆ గొప్పతనం అంతా రాజమౌళికే సాధ్యం. అయితే వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చినా.. తన సొంత టాలెంట్ తో దర్శకుడిగా ఎదిగాడు జక్కన్న. అపజయం ఎరుగని దర్శకుడిగా కూడా ఆయన పేరుమీద రికార్డ్ ఉంది. 

Also Read:విదేశాల్లో వ్యవసాయం చేస్తున్న స్టార్ హీరో కొడుకు


అటువంటి దర్శక ధీరుడికి  కూడా ఇండస్ట్రీలో అవమానాలు తప్పలేదు. అవును కెరీర్ బిగినింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డాట జక్కన్న. అంతే కాదు ఇండస్ట్రీ జనాలతోనే కాకుండా బయట కూడా తనకు అవమానం జరిగిందని ఓ సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజమౌళి.  సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి చిన్నప్పుడు చెన్నై లో ఉండేవారట. 

Also Read: బంపరాఫర్‌.. డేటింగ్ కు వెళ్లండి.. పిల్లలను కనండి.. బహుమతులు పొందండి. ఎక్కడో తెలుసా..?
 

అయితే ఏదో తీసుకోవాలి అని చాలా పొద్దున్నే సూపర్ మార్కెట్ కు వెళ్లాడట రాజమౌళి. అయితే అప్పుడు అక్కడ బిల్ వేసే అతను ఏదో ఆలోచిస్తూ లెక్కలు వేసుకుంటున్నాట. అయితే తనకు కూడా అర్జెంట్ ఉండటంతో త్వరగా బిల్ వేయాలని తమిళ్ లో అడిగాడట రాజమౌలి. అలా నాలుగైదు సార్లు అడిగే సరికి అవతలి వ్యాక్తి పోరా అంటూ చిరాకు పడ్డాడట. అంటే అక్కడ కాసేపు ఆగు  అన్న అర్ధం వచ్చేలా తమిళ్ లో అన్నాట.

Also Read: కీర్తి సురేష్ ‌- శివకార్తికేయన్ లవ్ స్టోరీ నిజమేనా..? బ్రేకప్ కి కారణం ఎంటో తెలుసా !

దాంతో అంత వరకూ తనను ఇంట్లో వాళ్లు రారా అనడం తప్పించి బయట ఎవరు రా అనలేదు. తనకు విపరీతమైన కోపంవచ్చిందట. పెద్దయ్యాక బాగా డబ్బులు సంపాధించి మనుషుల్ని పెట్టి వీడ్ని కొట్టించాలి అన్నంత కోపం వచ్చిందట రాజమౌళికి. ఈ విషయాన్ని ఓపెన్ హర్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజమౌళి.  జక్కన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
 

రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈసినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అనే విషయంలో క్లారిటీ రావల్సి ఉంది.  సూపర్ స్టార్ అభిమానులు ఈసినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం సినిమా ఓపెనింగ్ అయినా అయితే బాగుంటుందని ప్యాన్స్ రిక్వెస్.

మరి జక్కన్న ఏం చేస్తాడో చూడాలి. అమెజాన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న ఈసినిమా మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే లుక్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!