Varanasi: మహేష్ బాబు హీరోగా `వారణాసి` మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి . ఇందులో రాముడిగా కనిపించబోతున్నారు మహేష్. ఈ పాత్ర కోసం ఆరు నెలలు చుక్కలు చూశాడట.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో `వారణాసి` సినిమాని రూపొందిస్తున్నారు. భారతీయ కథాంశానికి అంతర్జాతీయ హంగులు అద్దుతున్నారు. గ్లోబల్ ఆడియెన్స్ కూడా ఈ మూవీని చూసేలా ఆయన తెరకెక్కిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక శ్రద్ధా తీసుకుంటున్నారు. దాదాపు మూడేళ్లుగా శ్రమిస్తున్నారు. బేసిక్‌గా రాజమౌళి అంటేనే పర్‌ఫెక్షన్. నటీనటులు అయినా, టెక్నీషియన్లు అయినా ఆయన పర్‌ఫెక్షన్‌లోకి రావాల్సిందే.
25
మహేష్ బాబుకి చుక్కలు చూపించిన రాజమౌళి
ఎంత పెద్ద హీరో అయినా రాజమౌళి చెప్పినట్టు చేయాల్సిందే. ఒక్కో షాట్‌కి పది ఇరవై టేక్‌లు చేయాల్సింది. దానికి ఎవరూ అతీతం కాదు. ఇప్పుడు `వారణాసి` మూవీ విషయంలో కూడా అదే జరుగుతుంది. కేవలం రెండు షాట్స్ కోసం మహేష్ బాబుకి ఆరు నెలలు చుక్కలు చూపించాడట. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబునే వెల్లడించడం విశేషం. సినిమాలో కొంత రామాయణం పార్ట్ ని చూపిస్తున్నారు రాజమౌళి. ఈ విషయాన్ని టైటిల్‌ని ప్రకటించినప్పుడే తెలిపారు. లంక దాహనం ప్రధానంగా ఈ ఎపిసోడ్ ఉంటుందని ఆ టీజర్ చూసినప్పుడు అర్థమయ్యింది.
35
రాముడి లుక్ కోసం మహేష్ కి ప్రత్యేక శిక్షణ
అయితే రాముడి పాత్ర అన్నప్పుడు దానికో రూపు, పద్ధతి ఉంటుంది. రాముడు నిల్చునే తీరు, నడిచే తీరు, మాట్లాడే తీరు ఇలా ప్రతిదీ డిఫరెంట్‌గా ఉంటుంది. రాజులా ప్రవర్తించాల్సి ఉంటుంది. హందాతనం ఉండాలి, గాంభీర్యతా ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి. ఓర్పు, సహనం, సేవాగుణం ఇలా ప్రతిదీ బాడీలో, ఫేస్‌లో ప్రతిబింబించాల్సి ఉంటుంది. ఓ రకంగా మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ అని చెప్పొచ్చు. ఈ పాత్ర కోసం మహేష్ బాబు ఏకంగా ఆరు నెలలు కష్టపడాల్సి వచ్చిందట. కేవలం రెండు షాట్స్ కోసం ఆరు నెలలు ట్రైన్ అయ్యాడట. అందులో మూడు నెలలు పురాతన యుద్ధ కళ కళారి ని నేర్చుకున్నాడట. ఇదంతా రాముడిగా నిలబడటం కోసమే అని చెప్పారు మహేష్. అలాగే రాముడు ఎలా రన్ చేస్తారనేదానికి ఆరు నెలలుగా ట్రైనింగ్ కావాల్సి వచ్చిందని చెప్పాడు. ఇంత కష్టపడితే కేవలం రెండు షాట్స్ మాత్రమే తీసినట్టు తెలిపారు మహేష్.
ఈ సందర్భంగా మరో క్రేజీ విషయాన్ని వెల్లడించారు మహేష్. సినిమా సెట్ అయ్యే సమయంలో మహేష్, రాజమౌళి మధ్య జరిగిన కన్వర్జేషన్‌ని ఆయన లీక్ చేశారు. సినిమా చేయడానికి ఫస్ట్ మీట్ అయ్యాక రాజమౌళి కి మహేష్ ఒక సందేశం పెట్టాడు. `మీతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు మీ హీరోలను ఎంతగానో ప్రేమిస్తారు`అని మెసేజ్ పెడితే, ఆయన క్రేజీ రియాక్షన్ ఇచ్చారట. ఈ సందేశానికి ఆయన థ్యాంక్స్ చెబుతూ, కానీ నేను నా విలన్లని ఎక్కువగా ప్రేమిస్తానని తెలిపారట. దెబ్బకి మహేష్‌కి ఫ్యూజులు ఎగిరిపోయాయట.
55
గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్‌గా `వారణాసి`
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ `వారణాసి`. రాజమౌళి రూపొందిస్తున్న ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతుంది. గ్లోబ్ ట్రోటర్‌గా, టైమ్ ట్రోటర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారు. అదే సమయంలో రామాణయం కాలంలోకి కూడా వెళ్తాడని సమాచారం. ఇలా అనేక కాలాలు తిరిగి చేసే సాహసమే ఈ మూవీని అని తెలుస్తోంది. ఇందులో మహేష్ రుద్ర అనే పాత్రలో ప్రియాంక మందాకిని పాత్రలో, పృథ్వీరాజ్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. సుమారు రూ.1300కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 9న ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ఈ మూవీ రెండు పార్ట్ లుగా రాబోతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిపై రాజమౌళి స్పందించారు. ఒకే పార్ట్ గా వస్తుందని, నిడివి మూడు గంటలు ఉంటుందని చెప్పారు.