Published : Feb 04, 2026, 05:08 PM ISTUpdated : Feb 04, 2026, 05:09 PM IST
పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఉస్తాద్ రిలీజ్ డేట్ కంఫర్మ్ కావడంతో చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి అనే వార్తలకు బలం చేకూరింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. హరీష్ శంకర్ దర్శకుడిగా పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న రెండవ సినిమా ఇది. దీనితో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. చివరగా పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ హిట్ కావడంతో ఆ అంచనాలు ఇంకా పెరిగాయి.
25
రిలీజ్ డేట్ ఫిక్స్
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మార్చి 26న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
35
స్టైలిష్ పోస్టర్ వైరల్
ఈ మేరకు పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా రెడ్ కర్చీఫ్ పట్టుకుని ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ అదిరిపోయింది. పాన్ ఇండియా క్రేజీ చిత్రం ధురంధర్ 2 రిలీజ్ అయిన వారం గ్యాప్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతోంది. ధురంధర్ 2 దెబ్బకు పెద్ద పాన్ ఇండియా సినిమాలు పెద్ది, టాక్సిక్ లాంటివి వాయిదా పడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే ఈ సినిమాలు పాన్ ఇండియా చిత్రాలు.. నార్త్ మార్కెట్ చాలా కీలకం. ధురంధర్ కి ఎదురెళ్లి నార్త్ లో వసూళ్లు సాధించడం కష్టం. అందుకే పెద్ది లాంటి సినిమాలు వాయిదా పడబోతున్నట్లు టాక్. అయితే ఈ సినిమా వాయిదా ఇంకా అధికారికంగా కంఫర్మ్ కాలేదు.
55
ధురంధర్ 2 కి ఎదురెళుతున్న పవర్ స్టార్
కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి కావాల్సింది రీజినల్ మార్కెట్ మాత్రమే. ఇక్కడ పవర్ స్టార్ కింగ్. కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు అని నిర్మాతలు డిసైడ్ అయి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. శ్రీరామ నవమి ముందు రోజు ఉస్తాద్ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడిగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.