మహేష్‌ సినిమాలో హైలైట్స్ అవే, రాజమౌళి భారీ ప్లాన్‌..? చిన్నపిల్లాడు నుంచి, గ్లోబల్‌ ఆడియెన్స్ వరకు

First Published | Oct 22, 2024, 4:17 PM IST

మహేష్‌ బాబుతో రాజమౌళి చేయబోతున్న సినిమాకి సంబంధించిన క్రేజీ అప్‌ డేట్స్ బయటకు వచ్చింది. ఇందులో ఆ ఎలిమెంట్లే హైలైట్‌గా ఉండబోతున్నాయట. 
 

ప్రస్తుతం తెలుగులో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడం విశేషం. ఈ మూవీపై రోజు రోజుకి హైప్‌ పెరిగిపోతుంది. రాజమౌళి ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ పైనే ఉన్నాడు. పక్కాగా స్క్రిప్ట్ మాత్రమే కాదు, మిగిలిన అన్నీ విషయాలను చూసుకుంటున్నారు. ఒక్కసారి షూటింగ్‌ ప్రారంభిస్తే, గ్యాప్‌ లేకుండా మధ్యలో బ్రేకులు లేకుండా చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. షూటింగ్‌ పార్ట్ ఈజీగా ఉండటం కోసం ప్రీ ప్రొడక్షన్‌పైనే ఎక్కువ టైమ్‌ పెడుతున్నట్టు తెలుస్తుంది. 


బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మహేష్‌ బాబు ఈ సినిమా కోసం కొత్త మేకోవర్‌ అవుతున్నాడు. గెడ్డం పెంచి, జుట్టు పెంచి సరికొత్తగా కనిపిస్తున్నాడు మహేష్‌ బాబు. గతంలో ఎప్పుడూ మహేష్‌ని ఇలా చూసి ఉండరు. ఆయన లుక్‌ చూస్తేనే వీర మాస్‌గా ఉందని చెప్పొచ్చు. ఇది ఆయన ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.

బయట చూడ్డానికే ఇలా ఉంటే ఇక సినిమాలో ఎలా ఉండబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆ రేంజ్‌ స్టోరీ పడితే సినిమా వరే స్థాయిలో ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాజమౌళి మూవీ కావడంతో దాన్ని మించి ఉంటుందనేది టాక్‌. 


గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. తెలుగు సినిమా, ఇండియన్‌ మూవీని ఇప్పటి వరకు చూడనంత ఆడియెన్స్ ఈ సినిమా చూసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఎక్కువ మంది ఆడియెన్స్ కి రీచ్‌ అయ్యేలా చేస్తున్నారు. కంటెంట్‌ పరంగా క్వాలిటీ మాత్రమే కాదు, ప్రమోషనల్‌ గానూ సినిమాని భారీగా రీచ్‌ ఉండేలా చూస్తున్నారట.

సుమారు వెయ్యి కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నారట రాజమౌళి. ఆ పనుల్లోనే జక్కన్న ఉన్నారు. అయితే ఈ సారి సినిమాలో అదిరిపోయే ఎలిమెంట్లు జోడించబోతున్నారట. చిన్నపిల్లలు నుంచి, గ్లోబల్‌ ఆడియెన్స్ సైతం ఎట్రాక్ట్ అయ్యే ఎలిమెంట్లని, సీన్లని పెట్టబోతున్నారట. సినిమా ఎక్కువ స్థాయిలో రీచ్‌ ఉండటం కోసం సరికొత్త ప్లాన్‌ చేస్తున్నారట రాజమౌళి. 

ఈ మేరకు మహేష్‌ సినిమాని విజువల్‌ వండర్‌గా తెరకెక్కించబోతున్నారు. వీఎఫ్‌ఎక్స్ కి బాగా ప్రయారిటీ ఉంటుందట. అడవుల విజువల్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయని, వాటిని వరల్డ్ క్లాస్‌ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చేలా డిజైన్‌ చేయాలనుకుంటున్నారట. అడ్వెంచరస్‌ ప్రధానంగా విజువల్‌ వండర్‌లా రూపొందించే ప్లాన్‌ లో ఉన్నారు.

అయితే ఇందులో థ్రిల్లర్‌ ఎలిమెంట్లు కూడా ఉంటాయట. అంతేకాదు యానిమల్‌ సీక్వెన్స్ లు కూడా ఉంటాయని సమాచారం. ఫారెస్ట్ విజువల్‌, యానిమల్ సీక్వెన్స్ లు సినిమాలో హైలైట్‌గా ఉంటాయని తెలుస్తుంది. చిన్నపిల్లలను ఎట్రాక్ట్ చేసేలా ఈ అంశాలను మేళవించబోతున్నారు జక్కన్న.
 

ఇలా సినిమాని అన్ని రకాలుగా భారీగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట రాజమౌళి. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ఉండేలా, హాలీవుడ్‌ టాప్‌ రేంజ్‌ సినిమాల స్థాయిలో తెరకెక్కించే పనిలో ఉన్నారు జక్కన్న. మరి అది ఎంత వరకు సాధ్యమవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమాని జనవరిలో ప్రారంభించబోతున్నారట.

ఇటీవల విజయేంద్రప్రసాద్‌ ఓ కార్యక్రమంలో పాల్గొని మహేష్‌ సినిమా జనవరిలో స్టార్ట్ అవుతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూవీకి టాప్‌ క్లాస్‌ టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు. అదే సమయంలో ఆర్టిస్ట్ లు కూడా పాన్‌ ఇండియా ఇమేజ్‌ ఉన్న వారిని తీసుకోవాలనుకుంటున్నారట జక్కన్న. ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు. 

Read more: బయట బాలయ్య వ్యవహారాలన్నీ చంద్రబాబుకి తెలుసా? సీఎం నోటి వెంట బామ్మర్ధి మాస్‌ డైలాగ్‌

Also read: భర్తతో విడాకులపై రంభ కౌంటర్‌.. గొడవంతా ఆ విషయంలోనే, తెరవెనుక ఇంత జరిగిందా?

Latest Videos

click me!