
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. దేశ వ్యాప్తంగా ఈ షో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అయితే ఇప్పటికే మూడు సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు నాల్గో సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ సీజన్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ గెస్ట్ గా ప్రారంభం కాబోతుండటం విశేషం. ఈ నెల 25 నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రోమో విడుదల చేశారు.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇందులో రాజకీయ విషయాలను ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్‌తో కలవడానికి సంబంధించి, తనని అరెస్ట్ చేయడంపై, మొదటి రోజు జైల్లో ఏం జరిగిందనేది? వెల్లడించారు చంద్రబాబు నాయుడు. ఆ రోజు రాత్రి అంతా బస్సులోనే ఉన్నారట. తలుపు కొట్టినా తీయలేదట. మొదటి రాత్రి జైల్లో ఎలా గడిచిందనేది బాలయ్య అడగ్గా, మనసులో.. చావు గురించి ఆలోచించలేదంటూ ఎమోషనల్ అయ్యారు సీఎం.
దీంతో అటు బాలయ్య, ఇటు ఆడియెన్స్ సైతం ఎమోషనల్ అయ్యారు. తనని అరెస్ట్ చేయడంపై, ఆ 53 రోజులూ అంటూ చంద్రబాబు చేసిన కామెంట్లకి షో మొత్తం కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. ఈ క్రమంలో తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టను అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది.
పవన్ కళ్యాణ్, మిమ్మల్ని కలిసినప్పుడు జైలు గోడల మధ్య అక్కడ ఏం జరిగిందనేది ప్రజలకు తెలియాలి అని బాలయ్య ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు రియాక్ట్ అవుతూ, రెండు నిమిషాలు పవన్ కళ్యాణ్, నేను ఇద్దరం మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నప్పుడు.. ఒక నూతనమైన చరిత్ర రాయడానికి సమయ స్ఫూర్తిగా నిర్ణయం తీసుకోవడమనేది ఒక హిస్టారికల్ డెసీషన్ అని చంద్రబాబు చెప్పడంతో ఆడియెన్స్ క్లాప్స్ తో సంతోషం వ్యక్తం చేయడం విశేషం. అదే సమయంలో ఏపీలో వైజాగ్, విజయవాడ ఫోటోలు చూపించగా, తనకిష్టమైన ఫోటో పెట్టలేదని చెప్పడం విశేషం.
అనంతరం ధోనీ, విరాట్ కొహ్లీ ఫోటోలు చూపిస్తూ, బావ మీరు ధోనీ లాంటి లీడర్, నేనేమో కొహ్లీ లాంటి ప్లేయర్ అని బాలయ్య అడగ్గా, నేను విరాట్ కొహ్లీకే ప్రయారిటీ ఇస్తానని చెప్పడం విశేషం. దీంతోపాటు కొన్ని ఫన్నీ, కొంటె ప్రశ్నలు కూడా బాలయ్య నుంచి వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని బాలయ్య వ్యవహారాలు కూడా బావ చంద్రబాబు సెటైర్లు పేల్చడం విశేషం. ఇంట్లో(చంద్రబాబు ఇంట్లో) ఎవరు బాస్ అని ప్రశ్నించారు బాలయ్య.
అందులో చెల్లి నారా భువనేశ్వరని(చంద్రబాబు భార్య), కూతురు బ్రహ్మాణి(లోకేష్ భార్య) ఫోటోలు చూపించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, మాకు ఇంట్లో ఇది పెద్ద సమస్య అయిపోయిందని చంద్రబాబు చెప్పగా, అలా పెంచి పంపించామని బాలయ్య చెప్పడంతో చంద్రబాబు ఇంట్లో నారా బ్రాహ్మిణి బాస్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
అనంతరం ఓ సరదా కన్వర్జేషన్ నడిచింది. మా చెల్లి ఐదు వందలు ఇచ్చి బయట సరుకులు తీసుకురా అంటే మీరు ఏది తీసుకొస్తారు? అని అడిగాడు బాలయ్య. మొదట డబ్బులు జాగ్రత్తగా జేబులో పెట్టుకోవాలని చెప్పడం నవ్వులు పూయించింది. అనంతరం షుగర్ పాకెట్ తీసుకోగా, మీ లైఫ్‌లో షుగర్ ఏంటని ప్రశ్నించాడు బాలయ్య. దానికి చంద్రబాబు స్పందిస్తూ నీ లైఫ్‌లో చాలా షుగర్స్ ఉంటాయి.
కానీ నా లైఫ్‌లో ఒక్కటే షుగర్ అని చెప్పడం విశేషం. దీంతో షో మొత్తం అరుపులతో, క్లాప్స్ తో హోరెత్తింది. అనంతరం ఉల్లిగడ్డ ఎవరు అని చంద్రబాబు ప్రశ్నించారు, నేను మాత్రం వసుంధర పేరు చెబుతా అని తెలపడం విశేషం. దీంతోపాటు మా చెల్లితో కలిసి చూసిన రొమాంటిక్ సినిమా ఏంటని ప్రశ్నించాడు బాలయ్య, నువ్వు మరీ క్రాస్ ఎగ్జామ్ చేస్తే చాలా కష్టమైపోతుందనడం నవ్వులు పూయించింది.
ఇక ఇందులో మనమడు ఓ ప్రశ్న అడిగాడు. చిన్నప్పుడు చేసిన నాటీ పని ఏంటో ఒక్కటి చెప్పాలని అడిగాడు. దీనికి నువ్వు చెప్పు బాలయ్య అని చంద్రబాబు అనగా, మీమ్మల్ని అడిగాడు బావ, నన్నడగలేదు అని ఎన్బీకే చెప్పి తప్పించుకోవడం నవ్వులు పూయించింది.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నేను స్టూడెంట్స్ డేస్‌లో అని అప్పటి విషయాలను పంచుకున్నారు చంద్రబాబు. మరి ఆయన ఏం చెప్పాడనేది ఆసక్తికరం. అయితే ఇందులో మరో హైలైట్ పాయింట్ ఉంది. చివర్లో నేను మాస్ హీరో అయితే, మీరు మాస్ లీడర్ అని బాలయ్య అనగా, బోత్ ఆర్ నాట్ సేమ్ అని చంద్రబాబు చెప్పడం హైలైట్‌గా నిలిచింది.
అయితే ఇందులో బాలయ్య గురించి చంద్రబాబు చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారింది. షుగర్ టాపిక్ వచ్చినప్పుడు బాలయ్య లైఫ్‌లో చాలా షుగర్స్ ఉంటాయి అని చంద్రబాబు చెప్పడంలో ఆశ్చర్యమారింది. బాలయ్య షూగర్స్ వ్యవహారాలన్నీ చంద్రబాబుకి తెలుసా? అనేది ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అవన్నీ తెలిసే ఆయన ఈ కామెంట్ చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బాలయ్య తన సినిమా కెరీర్‌లో ఎన్నో వ్యవహారాలు నడిపించాడనేది ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాట. చాలా మంది హీరోయిన్లని ఇబ్బంది పెట్టారని అంటుంటారు. కొందరు హీరోయిన్లు పరోక్షంగా ఆరోపణలు కూడా చేశారు. అదే సమయంలో కొన్ని చోట్ల బాలయ్య దొరికిపోతే చంద్రబాబునే స్వయంగా ఇన్‌వాల్వ్ అయి సెటిల్ చేశాడనే పుకారు కూడా ఉంది.
ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు చేసిన కామెంట్ ఆశ్చర్యపరుస్తుంది. ఆయన ఆ `షుగర్` డైలాగ్ వెనుక స్టోరీ అదేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా ప్రోమో ఆసక్తికరంగా ఉంది. మెయిన్‌గా రాజకీయ పరంగా చంద్రబాబు చెప్పే విషయాలు హాట్ టాపిక్‌గా మారబోతున్నాయని చెప్పొచ్చు.
read more: భర్తతో విడాకులపై రంభ కౌంటర్.. గొడవంతా ఆ విషయంలోనే, తెరవెనుక ఇంత జరిగిందా?